Operation Trishul: దేశంలో ప్రస్తుతం బిహార్ ఎన్నికలు జరుగుతున్నాయి.. మరోవైపు అమెరికా భారత్‌పై వాణిజ్య ఒప్పందం విషయంలో ఒత్తిడి చేస్తోంది. దీంతో భారత్ ఈ కార్యకలాపాల్లో బిజీగా ఉంది. పాకిస్తాన్ కూడా ఇలాగే భావించింది. సైన్యం దృష్టి తమపై లేదని అంచనా వేసింది. రస్‌క్రీక్ వద్ద కదలికలు పెంచింది. సరిహద్దు మార్చే ప్రయత్నం చేసింది. కానీ అంతర్జాతీయ వేదికపై ప్రశాంతంగా కనిపించినప్పటికీ, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో చమురు ప్రాంతాలపై కదలికలు పెరుగుతుండడంతో త్రివధ దళాలు రహస్యంగా నిశ్శబ్ద ఆపరేషన్‌ను ప్రారంభించింది. ‘‘త్రిశూల్’’ పేరుతో జరిగిన ఈ వ్యూహం సర్జికల్ స్ట్రైక్‌లకు కొనసాగింపుగా నిలిచింది.
సర్ర్‌కీక్ వివాదం..
ఇసుక తిన్నెలతో, సముద్రఉప్పెనలతో నిండిన సర్ర్‌కీక్ ప్రాంతం కేవలం సరిహద్దు వివాదం కాదని, దాని కిందనున్న చమురు వనరుల వల్ల భవిష్యత్ ఆర్థిక శక్తి కేంద్రంగా ఉంది. పాక్ సైన్యం ఇటీవలి నెలల్లో ఇక్కడ చిన్న శిబిరాలు నెలకొల్పి కదలికలు పెంచడంతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది. పాక్ తోక జాడిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇప్పటికే హెచ్చరించారు. ఆర్మీ చీఫ్ కూడా ఆపరేషన్ సిందూర్ త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అది జరిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
సౌత్ బ్లాక్ నిర్ణయ క్షణాలు
ఢిల్లీలోని వార్ రూంలో రక్షణ మంత్రి నేతృత్వంలో త్రివిధదళాధిపతులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఉపగ్రహచిత్రాలు పాకిస్తాన్ సైన్యం కదలికలను స్పష్టంగా చూపించాయి. ఆ రాత్రే భారత్ సరిహద్దు రక్షణలను బలోపేతం చేయాలనే ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో మూడురోజుల్లో భారత్ నౌకాదళం గుజరాత్ తీరంలో 26 యుద్ధ నౌకలను మోహరించింది. రాజస్థాన్ ఎడారుల్లో సైనిక విన్యాసాలు ప్రతిధ్వనించాయి. వాయుసేన కూడా త్రిశక్తి, మహాగజరాజ్, రోమియో–1 అనే యుద్ధ వ్యూహాలతో సిద్ధమై హెచ్చరిక సంకేతాలు పంపింది. ఈ దృశ్యాలు ఉపగ్రహాల ద్వారా బయటపడటంతో పాక్ ప్రధానమంత్రిత్వ కార్యాలయంలో ఆందోళన అలుముకుంది.
పాక్ రాజకీయ, సైనిక గందరగోళం
కరాచీ నావికా కేంద్రంలో రాత్రివేళ కమాండర్లతో సమావేశమైన ఆసిమ్ మునీర్ భారత్ కదలికలతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. క్వెట్టా, పెషావర్, బలూచిస్థాన్ ప్రాంతాల్లో తిరుగుబాటు దాడులు ప్రారంభమవటంతో పాక్ మూడు వైపులా ఒత్తిడి ఎదుర్కొంది. రేడియో సంకేతాల ద్వారా ‘‘భారత్ యుద్ధ సన్నాహకం ప్రారంభించింది’’ అనే సమాచారం అందడంతో పాక్ నౌకలు వెనుకంజ వేశాయి.
మేల్కొని ఉన్న దేశ రక్షణ వ్యవస్థ
ఈ ఆపరేషన్ భారత సైనిక సిద్ధతకు ప్రతీక. భారత భద్రతా వ్యవస్థ చిన్న చలనం గమనించిన క్షణంలో ప్రతిస్పందించగల శక్తిగా మారిందని ఇది నిరూపించింది. సర్‌క్రీక్ సరిహద్దుపై భారత సైన్యం ఇప్పుడు నిరంతర నిఘాలో ఉంది, రెప్ప వాల్చక కాపలా కాస్తోంది.
ఆపరేషన్ త్రిశూల్ తూర్పు మయన్మార్ నుంచి పశ్చిమ సర్ర్‌కీక్ వరకు భారత వ్యూహ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. భవిష్యత్‌లో వివరాలు వెల్లడైనా, ఈ సంఘటన దేశ భద్రతా చరిత్రలో మరో మలుపు అవుతుంది. భారత్ ఇప్పుడు తన శత్రువులకు ఒక స్పష్టమైన సందేశం పంపింది.