Homeఆంధ్రప్రదేశ్‌Mohan Babu : మోహన్ బాబుకు కోపం వచ్చింది.. ఆయన పేరు వాడితే అంతే

Mohan Babu : మోహన్ బాబుకు కోపం వచ్చింది.. ఆయన పేరు వాడితే అంతే

Mohan Babu : మోహన్ బాబు కి కోపం వచ్చింది. ఆయన పేరును రాజకీయంగా ఎవరో వాడుకుంటున్నారట. ఆయనకు తెలిసి బాధపడ్డారట. అందుకే ఇప్పుడు ఆయన స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నారు. తన పేరును ఎక్కడైనా వాడితే చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నారు. అయితే సరిగ్గా ఎన్నికల ముంగిటే మోహన్ బాబు ఈ తరహా ప్రకటన చేయడం ఏమిటని అందరూ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసిపి కోసం ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గురించి పట్టించుకునే వారు లేకపోయారు. ఆయనతో పాటు వైసీపీకి పని చేసిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కి, పోసాని కృష్ణ మురళికి, చివరకు అలీకి సైతం పదవులు వచ్చాయి. కానీ సీఎం జగన్ కు బంధువైన మోహన్ బాబుకు మాత్రం ఏ పదవి రాలేదు.

అయితే మోహన్ బాబు ఇప్పటివరకు వైసీపీకి రాజీనామా చేయలేదు. అలాగని ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు కూడా తగ్గించేశారు. మొన్న ఆ మధ్యన చంద్రబాబును కలిశారు. ఎన్నికల ముంగిట సైలెంట్ గా ఉన్నారు. బిజెపిలో అధికారికంగా చేరతారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాజకీయాల కోసం తన పేరును వాడుకోవద్దని ప్రత్యేక ప్రకటన జారీ చేయడం విశేషం. అయితే ఎక్కడ తన పేరు వాడుకున్నారో మాత్రం చెప్పలేదు. అయితే ఎన్నికల ముంగిట మోహన్ బాబు ప్రకటన హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం మోహన్ బాబు నటనకు దూరంగా ఉన్నారు. కుమారుడు విష్ణు హీరోగా రూపొందుతున్న భక్తకన్నప్ప చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో సైతం యాక్టివ్ గా లేరు. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు భార్య సీఎం జగన్ కు సోదరి అవుతుంది. ఇక చిన్న కుమారుడు మనోజ్ భార్య భూమా మౌనిక తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కుమార్తె లక్ష్మీ ప్రసన్న బిజెపికి వీరాభిమాని. మోడీకి నిత్యం పొగడ్తలతో ముంచెత్తుతారు. అయితే ఈ ఎన్నికల్లో మోహన్ బాబు కుటుంబం ఏ పార్టీ వైపు వెళ్తుందో చూడాలి. అయితే మోహన్ బాబు ప్రకటన మాత్రం చర్చనీయాంశంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper