Homeజాతీయ వార్తలుModi Ladakh Plan: లడ్డాక్ లో మోడీ సరికొత్త పాచిక.. ఓవైసీ నుంచి కమ్యూనిస్టుల దాకా...

Modi Ladakh Plan: లడ్డాక్ లో మోడీ సరికొత్త పాచిక.. ఓవైసీ నుంచి కమ్యూనిస్టుల దాకా గడబిడ.. ఇంతకీ ఏం జరిగింది

Modi Ladakh Plan: దేశమంతా పొదుపు గురించి చర్చ జరుగుతోంది. అంతర్జాతీయంగా మధ్య ఆసియా యుద్ధం గురించి విశ్లేషణ సాగుతోంది. కానీ మన దేశానికి వచ్చేసరికి ఒక కీలక విషయం చోటు చేసుకుంది. దీనిపై ప్రధాన మీడియా సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు.. ఒకవేళ తెలిసినా కొన్ని మీడియా సంస్థలు తక్కువ ప్రయారిటీ ఇచ్చాయి.. కానీ అక్కడ జరుగుతున్నది.. జరగబోయేది కొంతమందికి మాత్రమే తెలుసు. దీంతో రియాక్ట్ అయ్యారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందుకంటే నరేంద్ర […]

Modi Ladakh Plan: దేశమంతా పొదుపు గురించి చర్చ జరుగుతోంది. అంతర్జాతీయంగా మధ్య ఆసియా యుద్ధం గురించి విశ్లేషణ సాగుతోంది. కానీ మన దేశానికి వచ్చేసరికి ఒక కీలక విషయం చోటు చేసుకుంది. దీనిపై ప్రధాన మీడియా సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు.. ఒకవేళ తెలిసినా కొన్ని మీడియా సంస్థలు తక్కువ ప్రయారిటీ ఇచ్చాయి.. కానీ అక్కడ జరుగుతున్నది.. జరగబోయేది కొంతమందికి మాత్రమే తెలుసు. దీంతో రియాక్ట్ అయ్యారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ వేసిన స్కెచ్ అలాంటిది.

ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్, లడ్డాక్ వేరువేరు అయ్యాయి. లడ్డాక్ ప్రాంతంలో రెండు జిల్లాలు మాత్రమే ఉండేవి. ఒక జిల్లాలో ముస్లింలు.. మరో జిల్లాలో బుద్ధులు ఉండేవారు. ఈ రెండు జిల్లాలలో చాలావరకు గ్రామాలు దూరం గా ఉంటాయి. ఫలితంగా పరిపాలన అనేది సక్రమంగా సాగడం లేదు. పైగా ఇక్కడ ప్రేరేపిత హింస ఇష్టానుసారంగా సాగిపోతూ ఉంటుంది. గతంలో లడ్డాక్ ప్రాంతంలో వాంగ్ చుక్ పాల్పడిన హింస జమ్ము కాశ్మీర్లో అలజడి కారణమైంది. అతని ప్రేరేపిత పార్టీలు ఉన్నాయి. పైగా లడ్డాక్ ప్రాంతంలో చైనాకు సరిహద్దులో చాలా గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ భారతదేశానికి భద్రతకు సంబంధించి అత్యంత సున్నితమైన ప్రాంతాలు.

ఈ ప్రాంతాలలో అభయారణ్యాలు చాలా ఉన్నాయి. పైగా లడ్డాక్ ప్రాంతంలో కొన్ని సంచార తెగలు ఈ ప్రాంతాలలో పశువులను మేపుతుంటారు. ఆరు నెలలపాటు అ పశువులను అక్కడ మేపి.. వాటి ద్వారా ఉన్ని సేకరిస్తారు.. ఈ ప్రాంతాలు అత్యంత సున్నితం. అయితే ఇక్కడ అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. చాలా గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయాలు లేవు. దీనిని గుర్తించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం.. ఈ ప్రాంతాలను ఏడు జిల్లాలుగా మార్చింది. అన్ని జిల్లాలలో అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీనిద్వారా ఇక్కడ శాంతిభద్రతల పరిరక్షణ.. అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడుతుందని కేంద్రం భావించింది.

కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత ఓవైసీ ఖండించారు. కొంతమంది కమ్యూనిస్టులు కూడా తప్పు పట్టారు. ముస్లిం జనాభా ప్రాబల్యానికి ప్రమాదం ఏర్పడుతుందని ఓవైసీ ఆరోపిస్తున్నారు. కానీ అక్కడ మతపరమైన వివాదాలు చెలరేగి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పైగా లడ్డాక్ ప్రాంతంలో ఒకే ఒక పార్లమెంట్ స్థానం ఉంది. ఇక్కడ అసెంబ్లీ స్థానాలు లేవు.

ఒకవేళ ఎన్నికల కోణంలో బీజేపీ అలా చేసింది అనుకుంటే.. అక్కడ ఎటువంటి శాసనసభ స్థానాలు లేవు. ఓవైసీ, కమ్యూనిస్టులు ఇలా గోల చేస్తున్నారంటే.. అక్కడ మన దేశానికి ఏదో మంచి జరుగుతుందని అర్థం. అందువల్లే ఆ స్థాయిలో ఆ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయని బిజెపి నేతలు అంటున్నారు.. ఆర్టికల్ 370 సమయంలో కూడా ఇలానే వ్యాఖ్యానించారని.. ఇప్పుడు జమ్ము కాశ్మీర్లో పరిస్థితులు.. అభివృద్ధి అద్భుతంగా సాగుతున్న నేపథ్యంలో కుహనా మేధావులు కళ్ళు మూసుకున్నారని బిజెపి నాయకులు అంటున్నారు.

నరేంద్ర మోడీ వేసిన పాచిక వల్ల మతోన్మాద పార్టీల ఎత్తుగడలు చిత్తు అయ్యాయని బిజెపి కార్యకర్తలు పేర్కొంటున్నారు.. ఈ ప్రాంతాలను ఏడు జిల్లాలుగా విస్తరించడం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది. శాంతి భద్రతల పరిరక్షణ సులభం అవుతుంది. అందువల్లే మతోన్మాద గొడవలు. ఇతర కుట్రలకు ఆస్కారం ఉండదని ఓవైసీ బాధపడుతున్నారని.. అందువల్ల కేంద్రం మీద విమర్శలు చేస్తున్నారని బిజెపి నాయకులంటున్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper