125 cc bikes : అందరికీ పెద్దపెద్ద సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలు ఇష్టం ఉండదు. కొందరు స్వల్పశ్రేణి.. మధ్య శ్రేణి ద్విచక్ర వాహనాలను సైతం ఇష్టపడుతుంటారు.. భారతీయ మార్కెట్లో ఇప్పటికి పెద్దపెద్ద శ్రేణి ఇంజన్ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాల కంటే.. మధ్యస్థ శ్రేణి సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలను యువత ఇష్టపడుతున్నది. హీరో… టీవీఎస్.. బజాజ్ కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి.
Bajaj Pulsar
Hero company glamour x తో బజాజ్ పల్సర్ పోటీపడుతోంది. తాజాగా 125 సిసి ఇంజన్ సామర్థ్యం తో ఉన్న మోడల్ అందుబాటులో తీసుకొచ్చింది. గతంలోనే ఈ మోడల్ ఉన్నప్పటికీ.. ఇటీవల కొన్ని మార్పులు చేసింది. ఈ మోడల్ లో ఐదు అంగుళాల టిఎఫ్టి డిస్ప్లే వచ్చేసింది. రైడ్ మోడ్స్.. టెక్.. గూగుల్ మ్యాప్స్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను అందుబాటులో తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్ షోరూం లో దీని ధర 92, 900గా నిర్ణయించారు..
TVS rider
TVS rider లో కూడా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. టాప్ ట్రిమ్స్ లో టీ ఎఫ్ టీ, కొత్త సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ ఇందులో ఉంది. డిస్ప్లే పరంగా.. మైలేజ్ పరంగా సరికొత్త ఫీచర్లను టీవీఎస్ కంపెనీ రూపొందించింది..
Honda SP 125
Honda company లో ఎస్పీ 125 మోడల్ అత్యంత ఆదరణ పొందింది. ఈ మోడల్ లో ఓబిడి 2 బి ఇంజన్ ను కంపెనీ ఏర్పాటు చేసింది. రైట్ బై వైర్.. క్రూజ్ కంట్రోల్.. రైడింగ్ మోడ్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హోండా కంపెనీలో ఎస్పీ 125 మోడల్ మీద ప్రతి ఆరువేల కిలోమీటర్ల దూరంకి సర్వీస్ షెడ్యూల్.. ఆప్షనల్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు అందుబాటులో ఉంటుంది.
Hero glamour x
Hero glamour x లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఫుల్ కలర్ కన్సోల్.. రైడర్ అసిస్టెంట్ ఫీచర్లు ఇందులో సూపర్ గా ఉన్నాయి. దీని ఇంజన్లో క్రూజ్ కంట్రోల్ సిస్టం ఉంది. రైడింగ్ మోడ్స్ కూడా అద్భుతమైన అనుభూతిస్తుంది. ఏబీఎస్ డ్యూయల్ డిస్క్ బ్రేకులు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన ద్విచక్ర వాహనాలకు ఎప్పటికప్పుడు సర్వీసింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. డైలీ యూజ్ కోసం టైప్ సి చార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది.
ఆటోమొబైల్ నిపుణుల అంచనా ప్రకారం పల్సర్ 125.. గ్లామర్ ఎక్స్ పెట్టిన ప్రతి రూపాయికి పైసా వసూల్ లాంటి సౌకర్యాలు అందిస్తున్నాయి. వీటిల్లో ఫుల్ కలర్ కన్సోల్.. రైడర్ అసిస్టెంట్ వంటి ఫీచర్లో ఉన్నాయి. టీవీఎస్ రైడర్లు కూడా టిఎఫ్టి డిడి.. ఎస్ ఎక్స్ సి డి వేరియంట్లలో ఏబిఎస్.. డ్యూయల్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. బ్రేకింగ్ వ్యవస్థ కూడా అత్యవసర సమయాల్లో సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది. ఇక హోండా ఎస్పి 125 వేరియంట్ లో మాత్రం సింపుల్ ఎల్సిడి డిస్ప్లే ఉంది. నమ్మకమైన హార్డ్వేర్ ఉన్నప్పటికీ అది ప్రాక్టికల్ గా ఉంటుంది. ఇక పల్సర్ విషయానికొస్తే అది డెఫినెట్లీ డేరింగ్ గుర్తింపును కొనసాగిస్తున్నది.
125 సిసి సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలు లీటర్ కు 55 నుంచి 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంటాయి. ఇక టీవీఎస్ రైడర్ సిటీలో లీడర్ కు 57 కిలోమీటర్లు.. హైవే మీద 62 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది. గ్లామర్ ఎక్స్ 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.. హోండా ఎస్పి 125 60 కిలోమీటర్ల పైగానే మైలేజ్ ఇస్తుంది. ఇక 125 భాగంలో పాత పల్సర్ లీటర్కు 57 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చేది.. ఇక కొత్త మోడల్ ను ఇంతవరకు పరీక్షించలేదు. ఇచ్చే మైలేజ్ ఆధారంగా కస్టమర్లు ఈ వాహనాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
125 సిసి సామర్థ్యం ఉన్న ఈ ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలి అంటే 10% డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఒకవేళ 10.5% వడ్డీ రేటు తో 36 నెలల కాలపరిమితి గనుక ఎంచుకుంటే ఈఎంఐ 3200 నుంచి 3600 వరకు ఉంటుంది. బైక్ కొనుగోలు చేస్తున్నప్పుడు డీలర్ ఇచ్చే కొటేషన్లు ఇన్సూరెన్స్.. హ్యాండ్లింగ్ చార్జీలు.. ఇతర యాక్సెసరీల ధరలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నచ్చిన కలర్ వేరియంట్ అందుబాటులో లేకపోతే.. ప్రీ ఆర్డర్ ఇవ్వచ్చు.