Minor Girl: కంచే చేను మేసింది. కను రెప్పే కంటిని కాటేసింది. రక్షణగా ఉండాల్సిన కన్నతండ్రే కాలయముడయ్యాడు. తన కోరిక తీర్చుకునేందుకు కూతుర్నే ఎంచుకున్నాడు. కూతురుకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన తండ్రే ఆమెకు నరకాన్ని చూపించాడు. ఇది చూసి తట్టుకోలేని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. జరిగే తతంగం గురించి ఆమె మేనత్తకు చెప్పి తన బాధను వెల్లడించింది.
రాజస్థాన్ రాష్ర్టంలోని జలోర్ జిల్లాలో ఓ కన్న తండ్రి కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్నతండ్రి అరాచకాలను చూసి కొడుకు సైతం కలత చెంది తన జీవితాన్నే చాలించాడు. కాపాడాల్సిన తండ్రే మృగాడిలా ప్రవర్తిస్తూ బాలికపై పలుమార్లు లైంగికదాడికి తెగబడ్డాడు. కాపాడాల్సిన తండ్రే ఇలా చేయడంపై ఆమె ఎవరికి చెప్పుకోలేక మనసులోనే కలత చెందింది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మేనత్తకు ఆడియో ద్వారా విన్నవించుకుంది.
తండ్రి చేసే దురాగాతాలను బాలిక తన మేనత్త కు 32 నిమిషాల ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. దీంతో బాలిక సోదరుడు తెలుసుకుని తండ్రి చేసే దుర్మార్గాన్ని సహించలేక తనువు చాలించాడు. సాంచోర్ ప్రాంతంలోని నర్మద కాలువలో దూకి మరణించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన వెలుగు చూడడంతో బాలిక తండ్రి ఇంటి నుంచి పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం బాలిక స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
బాలిక విడుదల చేసిన ఆడియో క్లిప్ సంచలనంగా మారింది. తండ్రి మొబైల్ ఫోన్ కొనిస్తానని చెప్పి కారులో తీసుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడని పేర్కొంది. దీనిపై బాలిక అత్త కూడా తండ్రిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కానీ అతడిలో మార్పు రాలేదు. పలుమార్లు బాలికను తన కోరిక తీర్చమని గోల చేస్తూ వెకిలి చేష్టలతో వికృతంగా ప్రవర్తించేవాడని వాపోయింది. ఈ ఆడియో రాష్ర్టంలో సంచలనం కలిగించింది.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More