
అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ రోరీ బర్న్స్ (50) ఔటయ్యాడు. శార్ధూల్ ఠాకూర్ వేసిన 40వ ఓవర్ రెండో బంతిని బౌండరీకి తరలించిన బర్న్స్ తర్వాతి బంతికి రెండు పరుగులు తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే అతడు కీపర్ రిషబ్ పంత్ చేతికి చిక్కాడు. మరో బ్యాట్స్ మెన్ హమీద్ (47) మరుగులతో ఉండగా డేవిడ్ మలన్ క్రీజులోకి వచ్చాడు.