Homeజాతీయ వార్తలుMeghalaya: మేఘాలతో ముచ్చట్లు చెబుతారా.. వర్షాలతో సయాటలాడతారా.. మనదేశంలో ఈ ప్రాంతం ఎక్కడుందంటే..

Meghalaya: మేఘాలతో ముచ్చట్లు చెబుతారా.. వర్షాలతో సయాటలాడతారా.. మనదేశంలో ఈ ప్రాంతం ఎక్కడుందంటే..

Meghalaya: ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత.. చాలామంది భారతీయులు విహారయాత్రలకు విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలలో ప్రకృతి అందాలను చూసి మైమరచిపోతున్నారు. విదేశాలకు వెళ్లడం మంచిదే.. కానీ మన దేశంలో కూడా అంతకుమించిన అందాలు.. ప్రకృతి సోయగాలు ఉన్నాయి. అటువంటి వాటిల్లో మేఘాలయ ముందు వరుసలో ఉంటుంది. మేఘాలయ పేరులోనే మేఘముంది. ఇక్కడ ఎత్తైన కొండలు.. ఈశాన్య ప్రాంతంలో ఉన్న అడవులు.. అనుభూతి చెందాలే గాని.. ఇక్కడ ప్రతి ప్రదేశం కూడా గొప్పగానే ఉంటుంది. జలపాతాలు అద్భుతంగా […]

Meghalaya: ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత.. చాలామంది భారతీయులు విహారయాత్రలకు విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలలో ప్రకృతి అందాలను చూసి మైమరచిపోతున్నారు. విదేశాలకు వెళ్లడం మంచిదే.. కానీ మన దేశంలో కూడా అంతకుమించిన అందాలు.. ప్రకృతి సోయగాలు ఉన్నాయి. అటువంటి వాటిల్లో మేఘాలయ ముందు వరుసలో ఉంటుంది.

మేఘాలయ పేరులోనే మేఘముంది. ఇక్కడ ఎత్తైన కొండలు.. ఈశాన్య ప్రాంతంలో ఉన్న అడవులు.. అనుభూతి చెందాలే గాని.. ఇక్కడ ప్రతి ప్రదేశం కూడా గొప్పగానే ఉంటుంది. జలపాతాలు అద్భుతంగా ఉంటాయి. మేఘాలు రారమ్మని కబురు పెడతాయి. వర్షాలు సరికొత్త ఆనందాన్ని అందిస్తుంటాయి. ఇక్కడ ప్రతి ప్రయాణం ఒక మధురంగా.. జీవితకాల జ్ఞాపకంగా సాగిపోతూ ఉంటుంది

మేఘాలయ రాజధాని షిల్లాంగ్.. ఇక్కడ అడుగుపెట్టగానే బ్రిటిష్ హిల్ స్టేషన్ లాంటి సౌకర్యం ఉంటుంది.. వార్ట్స్ లేక్ దగ్గర సాయంత్రం దగ్గరగాలి అద్భుతంగా ఉంటుంది. చిరపుంజి ప్రాంతంలో మేఘాలు చేతికి అందె ఎత్తులోనే ఉన్నట్టు కనిపిస్తుంటాయి.. నోహ్ ఖలీకై ఫాల్స్ నుంచి పడే ధారలు అద్భుతంగా ఉంటాయి. సెవెన్ సిస్టర్స్ ఫాల్స్ జీవితకాల అనుభూతిని అందిస్తుంటాయి. డాకిలో ప్రాంతంలో ఉన్న ఉంగాట్ రివర్ ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అందులో ప్రయాణిస్తుంటే దారిలో తేలుతున్నట్టే కనిపిస్తూ ఉంటుంది. లివింగ్ రూటు బ్రిడ్జి కూడా ప్రకృతిలో ఒక భాగంలాగా కనిపిస్తూ ఉంటుంది.

మేఘాలయ ప్రాంతంలో జలపాతాల మధ్య ప్రయాణం అద్భుతమైన అనుభూతిని కల్పిస్తూ ఉంటుంది. గుహవాటి విమానాశ్రయం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఐదు రోజులపాటు ట్రిప్ చేస్తే మేఘాలయ మొత్తాన్ని చూసి రావచ్చు. మావ్ లిన్నాంగ్, చిరపుంజి, డాకి రివర్, లివింగ్ రూట్ బ్రిడ్జెస్, షిల్లాంగ్ ప్రాంతాలు చూడొచ్చు

హైదరాబాద్ నగరం నుంచి మేఘాలయ వెళ్లడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. బడ్జెట్లోనే పూర్తి కావాలంటే ఒక్కొక్క వ్యక్తికి 28 వేల నుంచి 35 వేల వరకు అవుతుంది. ఒకవేళ స్టాండర్డ్ కంఫర్ట్ ప్లాన్ కావాలి అనుకుంటే 40 ల నుంచి 55000 వరకు ఖర్చవుతుంది. ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే 70 వేల నుంచి 95 వేల వరకు ఖర్చవుతుంది. గుహవాటి నుంచి షిల్లాంగ్ ప్రాంతం వరకు రోడ్డు ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ స్టే చార్జెస్ ప్రతి రాత్రి దాదాపు 2000 నుంచి 5000 వరకు ఉంటాయి.

ప్రీమియం రెస్టారెంట్ లో ఉండాలి అనుకుంటే ₹7,000 నుంచి 15000 వరకు ఖర్చు పెట్టుకోవాలి. లోకల్ సైట్ సీయింగ్ ప్యాకేజీలు కూడా ఉంటాయి. ప్రైవేట్ క్యాబ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నగరం నుంచి గుహవాటి ప్రాంతానికి డైరెక్ట్ లేదా కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ రోడ్డు ప్రయాణం చేయాలనుకునేవారు విజయవాడ బెంగళూరు లేదా హైదరాబాద్ నుంచి బెంగళూరు ద్వారా గుహవాటి చేరుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper