Meghalaya Honeymoon: మేఘాలయలో ఇందౌర్ జంట అదృశ్యం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవ దంపతులు అదృశ్యమవ్వగా.. కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ మృతదేశం లభ్యమైన సంగతి తెలిసిందే. కన్పించకుండా పోయిన ఆయే భార్య సోనమ్ ఆచూకీని పోలీసులు తాజాగా గుర్తించారు. భర్త హత్య కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోనమ్ తన భర్తను చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.