Meghalaya Honeymoon Case: తన భర్తను అంతం చేయడానికి మూడు సార్లు ప్రయత్నించింది. నాలుగో ప్రయత్నంలో అతడిని అంతం చేసింది. అయితే ఈ వ్యవహారంలో ఆమె తన ప్రియుడు రాజ్ కుశ్వా,కొంతమంది వ్యక్తుల సహకారం తీసుకుంది. తన భర్తను అంతం చేయడానికి ఆ వ్యక్తులకు 20 లక్షల నగదు కూడా ఇచ్చింది. మేఘాలయకు భర్తతో కలిసి హనీమూన్ వెళ్ళినప్పుడు.. వారికి కూడా ఒక రూమ్ బుక్ చేసింది. తన భర్తకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసింది. మూడు సందర్భాల్లో రఘువంశీని అంతం చేయాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. చివరికి నాలుగోసారి ప్రయత్నించి.. అతడిని అంతం చేశారు.
Also Read: అందువల్లే టెస్ట్ కెప్టెన్సీ తీసుకోలేదు.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన బుమ్రా
అయితే ఈ కేసులో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. రఘువంశీని అంతం చేసిన తర్వాత సోనం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామల తర్వాత సోనం పోలీసులకు చిక్కింది. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా రఘువంశి, సోనం ట్రెక్కింగ్ చేస్తున్న వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. వీరి వెంట ముగ్గురు నిందితులు రావడం ఆ వీడియోలో కనిపించింది. ఒక టూరిస్ట్ గైడ్ ఆ దృశ్యాలను టూరిస్ట్ గైడ్ చిత్రీకరించాడు. అయితే దాన్ని గమనించిన నిందితులు తమ ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ వీడియోలు ఇప్పుడు ఈ కేసు విచారణకు అత్యంత కీలకంగా మారినట్లు తెలుస్తోంది.
అలా దర్యాప్తు చేయడంతో..
రఘువంశీని అంతం చేసే ముందు సోనం తన మంగళసూత్రాన్ని, మెట్టెలను హోటల్ రూమ్ లో పెట్టి వెళ్ళింది. ఇది పోలీసులకు ప్రధాన ఆధారంగా మారింది. ఆ తర్వాత పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా సోనం చేసిన దారుణం బయటపడింది. కాల్ డాటా.. సిసి పుటేజీలు చెక్ చేస్తుంటే సోనం రఘవంశీని అంతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కనిపించాయి. ఇక సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలు ఈ కేసు విచారణలో కీలకంగా మారినట్టు తెలుస్తోంది..అంతేకాదు ఈ వీడియోల ద్వారా పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే సోనం, ఆమె ప్రియుడు, ఇతర నిందితులు ఉన్నారు. అయితే సోనం చేసిన దారుణం పట్ల ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆమెను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. రఘు వంశీ కుటుంబానికి తాము అండగా ఉంటామని.. తమ సోదరీ చేసిన పనికి తల ఎత్తుకోలేకపోతున్నామని.. తమను క్షమించాలని వారు కోరారు.. అంతేకాదు ఈ కేసు విచారణలో పోలీసులకు తామ సహకరిస్తామని.. తన వద్ద ఉన్న ఎటువంటి ఆధారాలు అయినా సరే పోలీసులకు అందిస్తామని వారు పేర్కొన్నారు.
View this post on Instagram