Meghalaya Honeymoon Case: దేశవ్యాప్తంగా మేఘాలయ ఘటన సంచలనం సృష్టిస్తోంది. పెళ్లయిన ఏడు రోజులకే భార్య తన భర్తను కడ తేర్చడం.. దీనికోసం కొంతమంది సహాయం తీసుకోవడం.. దిగ్భ్రాంతి కలిగిస్తోంది. వితంతువుగా మారిపోయిన అనంతరం తన ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడం.. వంటివి సంచలనం కలిగిస్తున్నాయి.
తన ప్రియుడికి డబ్బులు ఇచ్చి మరీ భర్తను అంతమొందించిందని సోనమ్ అనే యువతి ఆరోపణలు ఎదుర్కొంటున్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజా రఘు వంశీ తో కలిసి సోనం హనీమూన్ నిమిత్తం మేఘాలయ వెళ్ళింది. అయితే ఆ ప్రాంతంలో తన ప్రియుడు రాజ్ కుస్వాహా తో కలిసి తన భర్త ప్రాణాలు తీయడానికి ప్రణాళిక రూపొందించింది. అనంతరం సోనమ్ ఒక్కసారిగా పరారీ అయింది. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు లోతుగా వెళ్లడంతో సంచలన విజయాలు వెలుగులోకి వచ్చాయి..
లోతుగా దర్యాప్తు చేయగా..
హనీమూన్ నిమిత్తం మేఘాలయకు వెళ్లిన సోనం, రఘు వంశీ కనిపించకుండా పోవడం కలకలం కలిగించింది. అయితే మొదట్లో పోలీసులకు అనుమానం రాలేదు. కానీ ఎప్పుడైతే సోనమ్ మీద పోలీసులకు అనుమానం కలిగిందో.. అప్పటినుంచే లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.. అనంతరం ఈ వ్యవహారంలో సోనమ్ పాత్ర ఉందని పోలీసులకు తెలియడంతో ముందుగా ఆమెను మేఘాలయ నుంచి అనంతరంపాట్నా తీసుకెళ్లారు. అక్కడి నుంచి పుల్వారి పోలీస్ స్టేషన్లో ఆమెను ఉంచారు.. ఇక ఆమెను పాట్నా నుంచి గౌహతి విమాన మార్గంలో తీసుకెళ్తారు. అక్కడి నుంచి మేఘాలయకు తీసుకెళ్లి కోర్టులో హాజరు పరుస్తారని తెలుస్తోంది..
ప్రియుడితో కలిసి..
సోనమ్ కు రఘు వంశీకి ఇటీవల వివాహం జరిగింది హనీమూన్ నిమిత్తం వారు మేఘాలయ వెళ్లారు. అక్కడే ఆమె తన ప్రియుడు రాజ్ ను కలుసుకుంది. తన భర్తను అడ్డు లేకుండా చేసేందుకు రాజ్ తో కలిసి ప్రణాళిక రూపొందించింది. ఆ తర్వాత ఆమె మాయమైంది. కొద్ది రోజులకే రఘు వంశీ విగత జీవుడిగా కనిపించాడు.. అయితే ఈ వ్యవహారంపై మేఘాలయ, మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తు జరిపారు.. టూరిస్ట్ గైడ్, హోటల్ సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా మొత్తం పరిశీలించారు. పోలీసుల విచారణలో సోనమ్ ఒక రేంజ్ లో యాక్టింగ్ చేసింది. తను అమాయకురాలినని.. తనను ఎవరో అపహరించారని కట్టుకథలు చెప్పింది. కానీ ఎప్పుడైతే పోలీసులు తమ స్థాయిలో విచారించారో అప్పుడే నిజం బయటికి వచ్చింది.
లొకేషన్ కూడా పంపించింది..
రఘు వంశి ఇండోర్ ప్రాంతంలో రవాణా వ్యాపారం చేస్తుంటాడు. సోనం ను అతడు మే 11న వివాహం చేసుకున్నాడు. మే 16న సోనం రఘు వంశీ హత్యకు ప్రియుడు రాజ్ తో కలిసి ప్రణాళిక రూపొందించింది.” వాడు చనిపోతే నేను వితంతువు అవుతాను. అప్పుడు మన పెళ్లికి మా నాన్న ఒప్పుకుంటారని” సోనం చెప్పడంతో రాజ్ దానికి ఒప్పుకున్నాడు.. రఘువంశీని అంతం చేయడానికి ఆన్ లైన్ లో ఒక ఆయుధాన్ని వారిద్దరు తెప్పించారు. ఇక హత్యకు పాల్పడే ముందు నిందితులు ఒక హోటల్లో బస చేశారు. కాదు వారికి లోకేషన్ కూడా సోనం పంపించడం విశేషం.
ఫోటోషూట్ పేరుతో..
ఇక మే 23న ఫోటోషూట్ పేరుతో రఘువంశీని సోనం మేఘాలయలోని ఒక కొండ ప్రాంతానికి తీసుకెళ్లింది. కొంత సమయం తర్వాత కతం చేయండి అంటూ గట్టిగా అరిచింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా రఘువంశీని అంతం చేశారు.. అయితే ఈ దారుణానికి ఒడి కట్టడానికి నిందితులు ఒప్పుకోలేదు. అయితే సోనం 20 లక్షలు ఇస్తానని చెప్పడంతో వారు ఒప్పుకున్నారు. ఈ ప్రమాదం తర్వాత సోనం ఘాజీపూర్ ప్రాంతానికి వెళ్ళింది. మార్గమధ్యలో తన ఫోన్ ధ్వంసం చేసుకుంది. అయితే పోలీసులు సిసి టీవీని పరిశీలించడంతో సోనం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సోనమ్ నిందితులతో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి.. కాల్ ట్రేసింగ్ ఆధారంగా రాజ్ వ్యవహారానికి కూడా పోలీసులు బయటపెట్టారు..
బాధిత కుటుంబం దిగ్భ్రాంతి
ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి రావడంతో సోనం సైలెంట్ అయిపోయింది. ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రాంతంలోకి వెళ్లి లొంగిపోయింది.. అయితే రఘు వంశీ ని అంతం చేసిన రాజ్.. అతని అంత్యక్రియలో పాల్గొని చివరి తతంగాలు జరిపించడం విశేషం. అంతేకాదు రఘు వంశీ మామ దవిసింగ్ ను అతడు ఓదార్చినట్టు నటించాడు.. అయితే ఈ దారుణం తెలుసుకున్న రఘు వంశీ కుటుంబీకులు దిగ్బ్రాంతి చెందుతున్నారు.