Homeజాతీయ వార్తలుIndia Pakistan Water Dispute: లింక్ 3.. భారత్ ఎక్కుపెట్టిన అస్త్రం.. పాకిస్తాన్ అడుక్కు తినడమే

India Pakistan Water Dispute: లింక్ 3.. భారత్ ఎక్కుపెట్టిన అస్త్రం.. పాకిస్తాన్ అడుక్కు తినడమే

India Pakistan Water Dispute: పోనీలే పాపం అని మనం వదిలిన నీళ్లను పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాల పాటు వాడుకుంది. వ్యవసాయం చేసింది. పంటలు పండించుకుంది. కానీ, తిన్నింటి వాసాలు లెక్కపెట్టే పాకిస్తాన్ పాలకులు.. మన మీద ద్రోహానికి పాల్పడ్డారు. ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఫలితంగా మన దేశం తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ విషయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా నీళ్ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ దేశానికి […]

India Pakistan Water Dispute: పోనీలే పాపం అని మనం వదిలిన నీళ్లను పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాల పాటు వాడుకుంది. వ్యవసాయం చేసింది. పంటలు పండించుకుంది. కానీ, తిన్నింటి వాసాలు లెక్కపెట్టే పాకిస్తాన్ పాలకులు.. మన మీద ద్రోహానికి పాల్పడ్డారు. ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఫలితంగా మన దేశం తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ విషయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా నీళ్ల విషయంలో కఠిన చర్యలు తీసుకుంది.

పాకిస్తాన్ దేశానికి సింధు నది.. దాని ఉపనదుల ద్వారా నీరు వెళ్తూ ఉంటుంది. అయితే భారత భూభాగంలో ప్రవహించే ఈ నీటికి మన దేశ పాలకులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇప్పటివరకు ఈ నీళ్లను పాకిస్తాన్ దర్జాగా వాడుకుంది. వ్యవసాయం కూడా చేసింది. అయితే ఈ నీళ్లను ఇప్పుడు భారత్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నట్టుగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది.. ఈ క్రమంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని కొక్సర్ ప్రాంతంలో 19 అడుగుల పొడవుతో ఒక డ్యామ్ నిర్మించింది. ఈ నీటిని 8.7 km పొడవు ఉన్న టన్నెల్ ద్వారా బియాస్ నదిలోకి పంపిస్తోంది.. దీని ద్వారా మనదేశంలో ఉన్న పంట పొలాలకు సాగునీరు అందుతూ ఉంటుంది.

ఈ ప్రాజెక్టు చాలా చిన్నది. భవిష్యత్తులో మన భూభాగం నుంచి పాకిస్తాన్ దేశానికి వెళ్లే నీటిని మొత్తం భారత్ అడ్డుకుంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ దేశంలో సాగునీరు సరిగ్గా అందక పంటలు పడడం లేదు.. దీంతో అక్కడి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. దీని అంతటికి ప్రధాన కారణం భారత్ సాగునీటికి అడ్డుకట్ట వేయడమే. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దేశానికి నీరు ఎలా ఇస్తామంటూ భారత్ ప్రశ్నిస్తోంది.

సింధు నది ప్రవాహాన్ని లెక్కల ఆధారంగానే వాడుకుంటామని పాకిస్తాన్ దేశానికి స్పష్టం చేసింది. చినాబు నది ప్రవాహం విషయంలో కూడా భారత్ కూడా ఇలానే వ్యవహరించింది. ఈ రెండు నదులు పాకిస్తాన్ దేశంలో వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవి.. ఈ ప్రవాహాలను అడ్డుకోవడం వల్ల పాకిస్తాన్ ఇప్పటికే దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇది ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper