spot_img
Homeజాతీయ వార్తలుKomatireddy Venkat Reddy: క‌ట్టెకాలే వ‌ర‌కు కాంగ్రెస్‌లోనే ఉంటాన‌న్న వెంక‌ట్‌రెడ్డి.. రేవంత్‌కు అతిపెద్ద మ‌ద్ద‌తు

Komatireddy Venkat Reddy: క‌ట్టెకాలే వ‌ర‌కు కాంగ్రెస్‌లోనే ఉంటాన‌న్న వెంక‌ట్‌రెడ్డి.. రేవంత్‌కు అతిపెద్ద మ‌ద్ద‌తు

Komatireddy Venkat Reddy:  ప్ర‌స్తుతం టీ కాంగ్రెస్‌లో దుమారం రేగుతున్న సంగ‌తి తెలిసిందే. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత రోజుకో అస‌మ్మ‌తి నేత తెర‌మీద‌కు రావ‌డం.. నానా రాద్ధాంతం చేయ‌డం కామ‌న్ అయిపోయింది. కాగా ఈ నేప‌థ్యంలోనే మొన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని క‌ల‌వ‌డం కాంగ్రెస్ లో సంచ‌ల‌నం రేపింది. అదే స‌మ‌యంలో ఇటు అసెంబ్లీలో ఆయ‌న త‌మ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వం మీద ప్ర‌శంస‌లు కురిపించారు.

Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy

దీంతో కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్ ఇద్ద‌రూ కూడా కాంగ్రెస్‌ను వీడుతార‌ని, బీజేపీలో చేరుతారంటూ ప్ర‌చారం జ‌రిగింది. త‌న‌కు టీపీసీసీ ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని వెంక‌ట్ రెడ్డి ఎప్ప‌టి నుంచో అసంతృప్తిలో ఉన్నారు. ఇవ‌న్నీ ఆయ‌న పార్టీ మారుతార‌ని సంకేతాలు ఇచ్చాయి. ఇక ఆయ‌న తమ్ముడు రాజ‌గోపాల్ రెడ్డి అయితే ఎన్నో సార్లు బీజేపీలో చేరుతారంటూ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు.

Also Read:  క‌ర్నూలు జ‌న‌సేన ఆఫీసుకు తాళం.. అన్నంత ప‌ని చేసిన వైసీపీ నేత‌లు

అయితే ఈ వార్త‌ల‌న్నింటికీ ఈ రోజు వెంక‌ట్‌రెడ్డి పులిస్టాప్ పెట్టేశారు. ఆయ‌న ఈ రోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డితో క‌లిసి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. త‌న ప్రాణం ఉన్నంత కాలం కాంగ్రెస్‌లోనే ఉంటానంటూ తేల్చి చెప్పేశారు. త‌న తమ్ముడు రాజ‌గోపాల్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని, తాను మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంటాన‌ని చెప్పుకొచ్చారు.

ఇత‌ర పార్టీల్లో త‌మ పార్టీలో కంటే ఎక్కువ గొడ‌వ‌లు ఉన్నాయ‌ని, అవ‌న్నీ చాలా కామ‌న్ అంటూ కొట్టి పారేశారు. అయితే కోమ‌టిరెడ్డి కామెంట్ల‌తో రేవంత్‌కు మ‌ద్ద‌తు పెరిగింద‌నే చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే ఓ వైపు జ‌గ్గారెడ్డి లాంటి వారు తిరుగుబాట ఎంజా ఎగిరేసిన స‌మ‌యంలోనే.. ఇలా పెద్ద మ‌ద్ద‌తు దొర‌క‌డం రేవంత్‌కు చాలా ప్ల‌స్ పాయింట్ అనే చెప్పుకోవాలి.

Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy

తాను అభివృద్ధి ప‌రంగానే కేంద్ర మంత్రుల‌ను, ప్ర‌ధాని మోడీని క‌లిశాన‌ని ఆ రూమ‌ర్ల‌కు కూడా చెక్‌పెట్టాడు కోమ‌టిరెడ్డి. మ‌రి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మ‌రింత వేగంగా ముందుకు తీసుకెళ్లాల‌ని చూస్తున్న రేవంత్‌కు కోమ‌టిరెడ్డి పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తారా లేదా అన్న‌ది మాత్రం వేచిచూడాలి.

Also Read: ఇక చాలు.. వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందే.. టీ కాంగ్రెస్ లో ప్రక్షాళన షురూ..

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

YSR Congress Party

YSR Congress: గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్!

YSR Congress: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేస్తున్న అతనిని కాదని వేరే వ్యక్తికి ప్రాధాన్యం...
YS Jagan

YS Jagan: జగన్ కు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్!

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పుంజుకునేందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. మరోవైపు పార్టీ నేతలకు కేసులు...
Tanuja

Tanuja: ‘అతని వల్లే ఈరోజు కళ్యాణ్ పడాల సేఫ్ గా ఉన్నాడు’ అంటూ ‘బిగ్ బాస్ 9’ ఫేమ్...

Tanuja: గత ఏడాది ప్రసారమైన 'బిగ్ బాస్ 9' షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి సీజన్స్ అన్నిటికంటే ఈ సీజన్ కే...
Andhra Pradesh Gold Mines

Andhra Pradesh Gold Mines: ఏపీకి బంగారం లాంటి వార్త!

Andhra Pradesh Gold Mines: జాతీయస్థాయిలో ఏపీ భరోసారీ ప్రత్యేక గుర్తింపు పొందింది.'గోల్డెన్' ఛాన్స్ దక్కించుకుంది.. రాయలసీమలో మరో జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న చిత్తూరులో...
Tollywood Heroes

Tollywood Heroes: దేశంలో ఇంత జరుగుతున్న మన స్టార్ హీరోల మౌనం వెనక కారణం…

Tollywood Heroes: ప్రస్తుతం ఇండియాలో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి...NEET ఎగ్జామ్ పేపర్ లీకేజి కారణం గా డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ల మీద పోలీసులు...
Oktelugu Epaper