spot_img
Homeజాతీయ వార్తలుTelangana Govt Jobs Notifications: ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ తయారేనా?

Telangana Govt Jobs Notifications: ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ తయారేనా?

Telangana Govt Jobs Notifications:  ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కారు దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. నోటిఫికేషన్లు విడుదల చేయాలని సంకల్పించింది. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేలా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నా వాటిని భర్తీ చేసేందుకు సిద్ధమేనని సీఎం కేసీఆర్ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఖాళీగా ఉన్న దాదాపు 80 వేల ఉద్యోగాల కోసం రెడీ గాఉన్నట్లు ప్రకటించి నిరుద్యోగుల ఎదురు చూపులకు కళ్లెం వేశారు. ఇక ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Telangana Govt Jobs Notifications
KCR

ఇదివరకు ప్రతిపక్షాలు ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేశాయి. దీంతో వారి నోళ్లకు తాళం వేసే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాల భర్తీ పై ఫోకస్ చేసినట్లు సమాచారం. అన్నింటికి ఒకే సమాధానంగా చేసుకుని కేసీఆర్ ముందుకు వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపై ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పడం గమనార్హం.

Also Read: క‌ర్నూలు జ‌న‌సేన ఆఫీసుకు తాళం.. అన్నంత ప‌ని చేసిన వైసీపీ నేత‌లు

ప్రభుత్వ ఉద్యోగమంటే అందరికి ఇష్టమే. కానీ అందరికి ఉద్యోగాలు ఇవ్వడం అంటే సాధ్యం కాదు. అందుకే ఉన్న ఉద్యోగాల్లోనే పోటీపడి ఉద్యోగం సాధించేందుకు యువత సిద్ధమవుతోంది. ఎలాగైనా పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సంపాదించాలని ఆశగా ఉన్నారు. ఈ క్రమంలో కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగంలో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు.

Telangana Govt Jobs Notifications
KCR

అవసరమైతే మరో పదివేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. దీంతో నిరుద్యోగుల్లో మరింత ఉత్సాహం పెరుగుతోంది. జాబ్ కోసం అహర్నిశలు శ్రమించి ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగ కల్పన తరువాత మంచి జీవితం ఉంటుందని ఊహించుకుంటూ అందుకనుగుణంగా సిద్ధమవుతున్నారు.

Also Read:  జగన్ ను దగ్గరి నుంచి చూస్తే.. పోసాని షాకింగ్ వ్యాఖ్యలు

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Andhra Pradesh Investments

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....
Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
Oktelugu Epaper