Uppal Balu: అగ్నిపరీక్ష’ 2 గురించి ఉప్పల్ బాలు గత కొద్దిరోజుల నుండి ఇన్ స్టాగ్రామ్ ని వేదికగా చేసుకొని చేస్తున్న కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారాయి. ముఖ్యంగా జడ్జీలలో ఒకరైన నవదీప్ పై ఉప్పల్ బాలు తీవ్రస్థాయిలో మండిపడుతూ వస్తున్నాడు. తనని వల్గర్ వీడియోస్ చేస్తున్నావని అవమానించాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఉప్పల్ బాలు కి సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్ నుండి మంచి సపోర్టు కూడా లభిస్తోంది. ఇష్టం లేకపోతే ముందే చెప్పేయొచ్చు కదా, అగ్ని పరీక్ష ఆడిషన్స్ కి పిలిచిమరీ అవమానించాల్సిన అవసరం ఏముంది? అంటూ నిలదీస్తున్నారు నెటిజెన్స్. ఇకపోతే నేటి నుండి స్టార్ మా ఛానల్ లో రాత్రి పది గంటలకు ప్రసారమయ్యే ‘అగ్ని పరీక్ష 2’ షో కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ని హాట్ స్టార్ లో అప్లోడ్ చేశారు.
ఈ ఎపిసోడ్ లో ఉప్పల్ బాలు ఆడిషన్ ని మీరు చూడొచ్చు. ముగ్గురు జడ్జీలు రెడ్ ఫ్లాగ్ ఇవ్వగా, ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోని ఉప్పల్ బాలు , ఈ సీజన్ కాకపోతే మరో సీజన్ , బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం నా ద్యేయం , ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇకపోతే రీసెంట్ గానే ఈయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ‘అగ్నిపరీక్ష 2’ ఆడిషన్స్ లో తనకు ఎదురైనా అనుభవాలను పంచుకుంటూ జడ్జీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ‘పొద్దునే 8 గంటలకు వెళ్తే , రాత్రి 2 గంటల వరకు ఒక రూమ్ లో వేసి నరకం చూపించారు. అయినా మేము భరించాము , మాకు ఒక అవకాశం ఇస్తారు కదా అని. ఊరికినే రాలేదు మేము , ఈ షో కోసం బట్టలు కొనుక్కోవడానికి 20 నుండి 30 వేల డబ్బులు ఖర్చు అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు ఉప్పల్ బాలు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఒక పేదవాడికి అవకాశం ఇవ్వరా?, మా లాంటి నిజాయితీ ఉన్న వాళ్లకు ఇవ్వరా?, 30 , 40 లక్షల ఆఫర్లు ఇచ్చి , బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చెయ్యమంటే , నేను చెయ్యలేదు , నేను నా నిజాయితీ గురించి మాట్లాడుతుంటే , బిందు మాధవి వాటి గురించి నువ్వు మాట్లాడకు అంటుంది. నువ్వు ఏమి చేసినావు అమ్మా బిందు మాధవి విన్నర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత?, పేద ప్రజలకు ఏమైనా ఆపరేషన్ చేయించావా?, ఒక్క రూపాయి అయినా దానం చేశావా ‘ అంటూ ఉప్పల్ బాలు చెప్పుకొచ్చాడు. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాను చూడండి.
View this post on Instagram