Jabardasth Comedian Navdeep: ‘జబర్దస్త్’ ద్వారా పరిచయమైన కమెడియన్స్ ఎవ్వరూ కెరీర్ పరంగా ఫెయిల్ అవ్వలేదు , కొందరు ఇప్పటికీ ‘జబర్దస్త్’ షో లో కొనసాగుతూనే ఉన్నారు , మరికొందరు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి , మోస్ట్ డిమాండ్ ఉన్న కమెడియన్స్ గా కొనసాగుతున్నారు. కానీ జబర్దస్త్ తో పాటు ‘శ్రీ దేవి డ్రామా కంపెనీ’ లో కనిపించిన కొంతమంది కమెడియన్స్ మాత్రం సరైన అవకాశాలు లేక, కనీసం ఉండేందుకు ఇల్లు కూడా లేక ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు ‘నవదీప్’. హైపర్ ఆది తో పాటు , ఎంతో మంది స్టార్ కమెడియన్స్ స్కిట్స్ లో కనిపించిన ఈయన , ఈరోజు తినడానికి త్రింది లేక , తాగడానికి నీళ్లు లేక , కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేక ఒక రోడ్డు మీద పడుకొని ఉండడాన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
రోడ్డు మీద పడుకొని ఉన్న ఇతన్ని చూసిన ఒక వ్యక్తి దగ్గరకి వెళ్లి వీడియో తీయడం మొదలు పెట్టాడు. నిన్ను ఎక్కడో చూసానే, టీవీ లో వస్తుంటావు కదా నువ్వు అని అడగ్గా ‘లేదు అన్నా.. వీడియో తియ్యకు.. పో ‘ అని అంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ‘లేదు నేను నిన్ను శ్రీదేవి డ్రామా కంపెనీ లో చూశాను , ఏమైంది , ఎందుకు ఇలా అయిపోయావు ‘ అని అడగ్గా, నవదీప్ అందుకు సమాధానం చెప్తూ ‘ప్రాణం గా ప్రేమించాను ఒక అమ్మాయిని. మోసం చేసింది. 30 లక్షల డబ్బులు ఉండేవి నా దగ్గర , మొత్తం IPL లో పెట్టి పోగొట్టింది. ఇప్పుడు తినేదానికి కూడా నా దగ్గర ఏమి లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది.
అయితే ఇదంతా స్కిట్ లాగానే ఉంది కానీ , నిజమని అనిపించడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడో ప్లాన్ చేసుకొని షూట్ చేసినట్టుగా ఉందని, సహజం గా అసలు లేదని అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం నమ్ముతున్నారు. అడ్రస్ పెట్టండి మేము సహాయం చేస్తాము అంటూ ముందుకు వస్తున్నారు. మరి నవదీప్ నిజంగా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడా?, లేదంటే డ్రామాలు చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అతను నిజంగా ఇబ్బందుల్లో ఉంటే , అతనికి సహాయం చెయ్యాల్సిన బాధ్యత జబర్దస్త్ తోటి కమెడియన్స్ కి , నిర్వాహకులకు ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.
View this post on Instagram