Karregutta: ఊటీని సందర్శించడానికి దేశవ్యాప్తంగా పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా కూడా సందర్శకులు వస్తూ ఉంటారు. అయితే తెలంగాణ వాసులు ఇకపై వేసవికాలంలోనే కాదు.. ఏ కాలంలో కూడా ఊటీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఊటీని అందుబాటులోకి తీసుకురానుంది. తెలంగాణలో ఉన్న కర్రెగుట్టల ప్రాంతాన్ని కేంద్రం పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ ప్రాంతంలో మావోయిస్టులను కేంద్రం ఎరివేసింది. చాలా రోజులపాటు కేంద్ర బలగాలు ఈ ప్రాంతంలో తిష్ట వేశాయి. మావోయిస్టులను భారీ సంఖ్యలో హతమార్చాయి. మంటూ వేసవిలో మావోయిస్టుల ఏరివేతను అత్యంత విజయవంతంగా చేపట్టాయి. దీంతో ఈ ప్రాంతం మావోయిస్టుల నుంచి కేంద్ర బలగాల చేతిలోకి వచ్చింది. ఇక్కడ కొండలు, చెట్లు, జలపాతాలు అద్భుతంగా ఉన్న నేపథ్యంలో.. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రణాళికలను రూపొందించినట్టు సమాచారం.
Also Read: మోదీ వన్‌మెన్ ఆర్మీనా.. డిబేట్‌లకు దూరం… వార్తల్లో నిజమెంత?
కర్రెగుట్టల ప్రాంతంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. ఒకరకంగా ఇది ఊటీ లాగానే ఉంటుంది. ఊటికి మించిన గుహలు ఎక్కడ ఉన్నాయి. ఇక జలపాతాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడవులయితే అత్యంత దట్టంగా ఉంటాయి. ఇక్కడ వాతావరణం వేసవిలో కూడా అద్భుతంగా ఉంటుంది. అందువల్లే ఈ ప్రాంతాన్ని తెలంగాణ ఊటీ లాగా మార్చాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.. దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి కూడా సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ ప్రాంతం దట్టమైన అడవి మధ్యలో ఉన్న నేపథ్యంలో పర్యాటకులకు భద్రత కల్పించే బాధ్యత కూడా కేంద్రం తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక్కడ అతిపెద్ద సాయుధ బలగాల శిక్షణ కేంద్రాన్ని నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది..
వాతావరణం విభిన్నంగా ఉండడంవల్ల..
ఇక్కడి వాతావరణం విభిన్నంగా ఉండడం.. మండువేసవిలోనూ చల్లగా ఉండడంవల్ల.. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కేంద్ర భావిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇక్కడ భారీగా రహదారులు నిర్మించాలని.. పర్యాటకులకు అనుకూలంగా ఉండే విధంగా హోటల్స్, రిసార్టులు నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇతర హంగులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.. ఒకప్పుడు ఈ ప్రాంతం మావోయిస్టులకు పెట్టని కోట కాబట్టి ప్రతి ఐదు కిలోమీటర్ల కు ఒకటి చొప్పున ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్ నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రాంతంలో స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా భద్రత కల్పిస్తాయని సమాచారం. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధికి సంబంధించి కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇస్తుందని తెలుస్తోంది.
Also Read: ఓయో రూంలకు వెళ్తున్నారా? ఎందుకైనా మంచిది ఈ వీడియో ఒకసారి చూడండి..