Operation Kagar: ఇప్పటికే ఆ ప్రాంతంలో రెండు బేస్ క్యాంపులు ఉండగా.. ఇప్పుడు మూడది కూడా ఏర్పాటయింది. ఇంతకీ ఆ ప్రాంతం పేరు కర్రిగుట్టలు.. తెలంగాణ -చత్తీస్ గడ్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్నాయి.. గోదావరి నదికి ఉత్తరం ప్రాంతంలో కర్రిగుట్టలు ఉన్నాయి. కర్రిగుట్టలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వాజేడు – వెంకటాపురం మండలాల పరిధిలోకి వస్తాయి. అటు ములుగు జిల్లాలోని కొన్ని మండలాలు కూడా ఈ గుట్టల పరిధిలో ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ కేంద్ర బలగాలు విస్తృతమైన స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అక్కడి వాతావరణం చూస్తుంటే యుద్ధం జరుగుతుందోనే అపోహ కలుగుతుంది. ఎందుకంటే సిఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు.. భారీగా వాహనాలు అక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి. ఇక అక్కడి నుంచి సిఆర్పిఎఫ్ కానిస్టేబులు అడవిలోకి వెళ్లడానికి వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.. సిఆర్పిఎఫ్ బలగాలు కర్రిగుట్టల్లో గత కొద్దిరోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. వారి చేతుల్లో అత్యంత ఆధునికమైన తుపాకులు.. ఆయన సామగ్రి కనిపిస్తోంది.
Also Read: పాకిస్థాన్‌పై దాడికి భారత్ వ్యూహం.. కీలక స్థావరం గుర్తింపు!
వాస్తవానికి గుట్ట లోపలికి వెళ్లడానికి రోడ్డు ఉన్నప్పటికీ పోలీసులు రోడ్డు దిగి నడిచి వెళ్తున్నారు.. ఎందుకంటే మావోయిస్టులు ఎక్కడైనా మందు పాతరలు అమర్చారేమో అనే భయంతో పోలీసులు రోడ్డు దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ సమీపంలోని పాలెం వాగు మీదుగా ఇటీవల కాలంలో హెలికాప్టర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి ఈ ప్రాంతం మీదుగా పెద్దగా గగనవిహంగాలు పరుగులు పెట్టవు. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ లో కేంద్ర బలగాలు కర్రిగుట్టలను టార్గెట్ గా చేసుకున్నాయో.. అప్పటినుంచి ఇక్కడ హెలికాప్టర్లు విస్తృతంగా కనిపిస్తున్నాయి.. దాదాపు రెండు వారాలుగా కర్రిగుట్టలో కేంద్ర బలగాలు ఆపరేషన్ చేపడుతున్నాయి..
కర్రిగుట్టలో ఏముంది?
స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం కర్రిగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు దాక్కుని ఉన్నారని తెలుస్తోంది.. వారందరిని మట్టు పెట్టడానికి కేంద్ర బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే వారు ఎక్కడ ఉన్నారు? దాక్కున్న వారిలో సీనియర్ మావోయిస్టులు ఉన్నారా? ఇప్పటివరకు చేపట్టిన ఆపరేషన్ లో ఎంతమంది మావోయిస్టులను అంతమొందించారు? అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. అయితే ఇప్పటివరకు కేంద్ర బలగాలు చేసిన ఆపరేషన్ లో ఆశించిన ఫలితం అయితే రాలేదు. అయితే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడానికి సిఆర్పిఎఫ్ బలగాలు అంతగా ఆసక్తిగా లేవు. ప్రభుత్వం అంచనావేసిన విధంగా ఇక్కడ భారీగా మావోయిస్టులు లేరని తెలుస్తోంది. ఒకవేళ మావోయిస్టు లేకపోయినప్పటికీ ఇక్కడ ఆపరేషన్ చేపడతామని సిఆర్పిఎఫ్ అధికారులు చెబుతున్నారు. ” ఇదంతా మావోయిస్టుల సామంతరాజ్యంగా ఉంది. ఇక్కడ సామాన్య మనుషులు కూడా తిరగనివ్వడం లేదు. ఎంతమంది ఇక్కడ దొరికారు అనేది మాకు ముఖ్యం కాదు. ఏ స్థాయిలో ఆయుధాలు లభించాయనేది కూడా అవసరం లేదు. అయితే ఇక్కడ మేము వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ లభించింది. కర్రిగుట్టలను పూర్తిగా స్వాధీనం చేసుకుంటాం.
అప్పటివరకు ఈ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉంటామని” సిఆర్పిఎఫ్ బస్టర్ ఐజి సుందర్ రాజ్ అంటున్నారు. అయితే సిఆర్పిఎఫ్ బలగాలు మావోయిస్టు లేఖ ఆధారంగా ఈ ఆపరేషన్ మొదలు పెట్టారా? లేక ముందుగానే ఒక ప్రణాళిక రూపొందించారా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సిందే. మరోవైపు మావోయిస్టులు సిఆర్పిఎఫ్ బలగాలను తప్పుదారి పట్టించడానికి ఈ లేఖ రాశారని.. వారు తెలివిగా చత్తీస్ గడ్ రాష్ట్రం వెళ్ళిపోయి ఉంటారని ప్రచారం జరుగుతోంది.. అయితే కర్రిగుట్టలను సిఆర్పిఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకుంటే ఒక రకంగా మావోయిస్టులకు కోలుకోలేని షాక్ ఇది. ఎందుకంటే దండకారణ్యంలో మావోయిస్టులకు అత్యంత సేఫ్ ప్లేస్ గా కర్రీ గుట్టలు ఉన్నాయి. ఇప్పుడు గనుక ఇవి సిఆర్పిఎఫ్ బలగాల చేతిలోకి వెళ్తే మాత్రం మావోయిస్టులకు ఇబ్బందికర వాతావరణం తప్పదు. మరోవైపు కర్రిగుట్టల చుట్టూ మావోయిస్టులు పాతిపెట్టిన మందు పాతరలను కేంద్ర బలగాలు నిర్వీర్యం చేస్తున్నాయి. వాటిని నిర్వీర్యం చేసే క్రమంలో కొన్ని సందర్భాల్లో పేలుతున్నాయి. ఆ శబ్దాలు కూడా సమీప గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే సిఆర్పిఎఫ్ బలగాలకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంతంతమాత్రం గానే సహకరిస్తున్నారని తెలుస్తోంది. భోజనం, వసతి కల్పించే విషయంలో పర్వాలేదని.. మిగతా విషయాలు మాత్రం తెలంగాణ పోలీసులు ఏమాత్రం సహకరించడం లేదని సిఆర్పిఎఫ్ బలగాలు అంటున్నాయి.
Also Read: విజయవాడ టు విశాఖ.. జూన్ 1 నుంచి విమాన సేవలు!