OYO hidden camera warning: ఓయో లో విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది. తట్టుకోలేనంత ఏకాంతం కూడా లభిస్తుంది. ఇక సర్వీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్లే యువత ఎక్కువగా ఓయో కు వెళ్తున్నది. ఇక మిగతా వర్గాల వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వారు కూడా ఓయో కు వెళ్లడానికి విపరీతమైన ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. సెక్యూరిటీ పరంగా ఓయో కు వంక పెట్టాల్సిన అవసరం లేదు. అలాగని గుడ్డిగా నమ్మాల్సిన పని కూడా లేదు. తరచూ ఓయో లకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గదులలో మూడో నేత్రాల గురించి పరిశీలించాలి. లేకపోతే అడ్డంగా ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నిఘా నేత్రాలను అత్యంత రహస్యంగా అమర్చి.. రూమ్ లలో జరుగుతున్న కార్యకలాపాలను రికార్డు చేసి.. చట్ట విరుద్ధమైన వ్యక్తుల చేతుల్లో పెట్టే అవకాశం లేకపోలేదు. అందువల్లే ఓయో లకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
Also Read: OYO room safety tips: ఓయో అనగానే రయ్యి మంటూ వెళ్ళకండి.. ఇవి తెలుసుకోకపోతే ఇరుక్కుంటారు..
ఓయో రూంలలో పెన్ను కనిపించినా అనుమానించాలి. ఎందుకంటే అందులో సీక్రెట్ కెమెరా పెట్టి ఉంటారని భావించాలి. చార్జింగ్ సాకెట్లో.. ఏసి పక్కన ఉన్న చిన్న చిన్న హోల్స్ లో కూడా సీసీ కెమెరాలు పెట్టే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల ఈ గదులకు వెళ్లేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. సిసి కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో తెలుసుకోవడానికి.. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి హెడెన్ కెమెరా ట్రేస్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి.. ఆ తర్వాత ఓయో రూం లో లైట్లు మొత్తం ఆఫ్ చేసి చూడాలి.. చీకట్లో గనుక మీకు ఎక్కడైనా ఎర్రగా బల్బులాగా వెలుగుతూ మార్క్ చేసినట్టు కనిపిస్తే వెంటనే అనుమానించాలి. అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేశారని భావించాలి. తదనుగుణంగా జాగ్రత్తపడాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మీరు చేసే వ్యవహారాలు సోషల్ మీడియాకు ఎక్కుతాయి. ప్రధాన మీడియాలో కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే చేరకూడని వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఇన్ని దారుణాలు జరగకూడదనుకుంటే అప్రమత్తంగా ఉండాలి. అన్నింటికీ మించి జాగ్రత్తగా ఉండాలి.
Also Read: OYO Room : పెళ్లికాని జంటలకు భారీ షాక్ ఇచ్చిన ఓయో.. ఇక పై రూం బుక్ చేసుకోవాలంటే రూల్స్ ఇవే !
ఇక ఇటీవల కాలంలో ఓయో రూం లకు వెళ్లే యువత సంఖ్య పెరిగిపోయింది. అక్కడి గదుల్లో విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది. పైగా వయసు వీడియో యువత తప్పుచేసే అవకాశం లేకపోలేదు. సాధారణంగా అటువంటి తప్పు చేయడానికి యువత అక్కడదాకా వెళ్తుంది. అక్కడిదాకా వెళ్ళిన తర్వాత తప్పు కచ్చితంగా జరుగుతుంది. అలాంటప్పుడు అలాంటి గదిలోకి వెళ్లే యువత జాగ్రత్తగా ఉండాలి. అన్నింటిని అత్యంత క్షుణ్ణంగా పరిశీలించాలి. అనుమానం వస్తే అక్కడ నుంచి రావడం అత్యుత్తమం అని భావించాలి.