Jyoti Malhotra: హర్యానా రాష్ట్రానికి చెందిన జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ గా పేరుపొందింది. అందానికి అందం.. చలాకితనానికి చలాకితనం ఉండడంతో.. ఈమె యూట్యూబ్ ఛానల్ ను చాలామంది అనుసరిస్తున్నారు. అయితే మొదట్లో ఆసక్తికరమైన విషయాలు పంచుకునే జ్యోతి.. ఆ తర్వాత దారి తప్పింది. కొన్నాళ్లపాటు మన బార్డర్ ఏరియాలపై స్టోరీ చేయడం మొదలుపెట్టింది. భారత్ చేస్తున్న పన్నాగాల వల్ల బార్డర్ ఏరియాలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. తక్షణమే భారత్ ఇలాంటి చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నట్టుగా ఆమె వీడియోలు రూపొందించేది. కాకపోతే ఈ వీడియోలలో పరోక్షంగా తన భావజాలాన్ని ప్రదర్శించేది. అలాంటి వ్యవహార శైలి వల్ల జ్యోతి పై ఎవరికీ ఎటువంటి అనుమానం రాలేదు.
Also Read: కొలికపూడి మళ్లీ కెలికేశారుగా..
2023లో పాకిస్తాన్ కు..
2023 సంవత్సరంలో జ్యోతి పాకిస్తాన్ వెళ్ళింది. ఆ సమయంలో ఆమె ఆ ప్రాంతం మొత్తం విస్తృతంగా పెరిగింది. టూరిస్ట్ వీసా తో చేయకూడని పనులు చేసింది. ఇక ఇదే సమయంలో ఢిల్లీలోని పార్క్ హై కమిషన్లో డానిష్ అనే వ్యక్తి తో జ్యోతి పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఇద్దరి మధ్య శారీరక కార్యకలాపాలు కూడా సాగిపోయాయి. ఒకానొక సందర్భంలో ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే ఆ ప్రపోజల్ మధ్యలోనే ఆగిపోయింది. ఇది ఇలా ఉండగానే డానిష్ ఆమెకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేట్స్ ను పరిచయం చేసాడు. దీంతో ఆమె మన దేశంపై తీవ్రమైన కోపాన్ని పెంచుకుంది. అక్రమంగా మన దేశాన్ని విమర్శించడం మొదలుపెట్టింది. చివరికి మనదేశంలో ఉన్న సున్నితమైన ప్రాంతాల సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కు చేరవేసినట్టు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ లో పనిచేసే ఒక వ్యక్తితో కూడా జ్యోతి సన్నిహితంగా ఉందని.. అతనితో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుందని అభియోగాలు వినిపిస్తున్నాయి.
ఇలా చిక్కింది
ఇటీవల ఆపరేషన్ సిందూర్ తర్వాత మన దేశ ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై నిఘా మొదలుపెట్టింది. అందులో జ్యోతి నిర్వహిస్తున్న ఛానల్ కూడా ఉంది. అయితే ఈ ఛానల్ లో మన దేశానికి వ్యతిరేకంగా కథనాలు.. ఎక్కువగా బార్డర్ విలేజెస్ పై స్టోరీస్ కనిపించడంతో.. ఈ ఛానల్ పై ప్రధానంగా దృష్టి సారించారు. ఆ తర్వాత జ్యోతి వివరాలను తెలుసుకున్నారు. ఎప్పుడైతే ఆమె 2023లో పాకిస్తాన్ వెళ్ళింది అని అధికారులకు తెలిసిందో.. ఇక అప్పటినుంచి వారు తమ సెర్చింగ్ మొదలుపెట్టారు. చివరికి జ్యోతి అసలు రంగు బయటపడటంతో.. ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ నిమిత్తం ఆమెను ప్రత్యేకమైన జైలుకు తరలించారు. మరి ఆ విచారణలో జ్యోతి చేసిన పాపాలు బయటపడతాయా? వాటి ఆధారంగా భారత్ చర్యలు తీసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
అక్కడ పర్యటించిందట
ఉగ్రదాడికి ముందు పహల్గాం ప్రాంతంలో యూట్యూబర్ జ్యోతి పర్యటించిందని తెలుస్తోంది. ఏప్రిల్ లో ఈ దాడి జరిగిన నేపథ్యంలో.. సరిగ్గా మూడు నెలల ముందు ఆమె ఆ ప్రాంతంలో పర్యటించిందని తెలుస్తోంది. అక్కడ పర్యటించిన తర్వాత.. అక్కడ ఉన్న కీలకమైన వివరాలను ఉగ్రవాదులకు చేరవేర్చినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన వీడియోను జ్యోతి తన యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేసింది. సాధారణ యూట్యూబర్ లాగా అక్కడికి వెళ్లిన ఆమె.. అక్కడి కీలకమైన సమాచారాన్ని తెలుసుకొని.. ఉగ్రవాదులకు చేరవేర్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఉగ్రవాదులు సైలెంట్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆ తర్వాత పర్యాటకులే లక్ష్యంగా దాడులు చేసి.. మారణ హోమాన్ని సృష్టించారు. ప్రస్తుతం జ్యోతిని విచారిస్తున్న అధికారులు.. మరింత కీలకమైన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉగ్రదాడికి ముందు పహల్గాంలో పర్యటించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా
వివాదాస్పదంగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహార శైలి. భారత రక్షణ రంగానికి చెందిన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసిన జ్యోతి. ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి జరగడానికి మూడు నెలల ముందు ఆమె పహల్గాం వెళ్లినట్లు సమాచారం. pic.twitter.com/TMbgC1CJeT
— ChotaNews App (@ChotaNewsApp) May 19, 2025