Surekha Vani: సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లతో పాటుగా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా చాలా మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళు డిఫరెంట్ పాత్రలను చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సురేఖ వాణి కి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ప్రఖ్యాతలైతే ఉన్నాయి. బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్ కి భార్యగా కొన్ని కామెడీ క్యారెక్టర్ లను సైతం పోషించినప్పటికి ఆ ఘనత తనకే సొంతం…అలాంటి సురేఖ వాణి రీసెంట్ గా ‘నిరమ్’ అనే మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్నప్పుడు మీరు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. దాని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు అని రిపోర్టర్ అడగగా..
దానికి ఆమె మాట్లాడుతూ నాకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని చెప్పింది. అలాగే నా కూతురు పెళ్లీడుకొచ్చిందని ఇప్పుడు నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఏదేమైనా కూడా ఆమె భర్త సురేష్ తేజ 2019 వ సంవత్సరంలో అనారోగ్య కారణంగా మరణించాడు.
ఇక అప్పటినుంచి తల్లి బిడ్డలు ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండటం వల్ల చాలామంది ఆమె మీద నెగిటివ్ కామెంట్ చేస్తుంటారు. అయినప్పటికి ఆమె వేటిని పట్టించుకోనని తనకు అనిపించింది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటానని నెగిటివ్ కామెంట్ల మీద స్పందించనని కూడా చెప్పింది.
రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని మంచి పాత్రలను చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదగాలని ఆమెను ఇష్టపడే కొంతమంది ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ప్రస్తుతం ఆమె ఇప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో సైతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుందని తను చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయిందని కూడా చెప్పడం విశేషం…ఇక రాబోయే రోజుల్లో సురేఖ వాణి టాప్ హీరోలకు మదర్ గా నటించే అవకాశం కూడా ఉంది…