LPG Cylinder Price: పశ్చిమాసియా ప్రాంతంలో ఇటీవల యుద్ధం చోటు చేసుకుంది. ఆ యుద్ధం ఆగడం లేదు.. పైగా అమెరికా.. గల్ఫ్.. ఇరాన్ దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ దాడుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి.
ప్రపంచం మొత్తం గ్యాస్..చమురు అవసరాలు మొత్తం గల్ఫ్ దేశాల ద్వారానే తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో గడచిన కొద్దిరోజులుగా అక్కడ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో చమురు సరఫరా.. ఉత్పత్తి మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ప్రపంచ అవసరాలు పెరిగిపోవడం.. అవసరాలకు తగ్గట్టుగా గ్యాస్.. చమురు ఉత్పత్తి కాకపోవడంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలు అవసరాలు పెరిగిపోయిన నేపథ్యంలో ధరలు ఆకాశాన్ని తాకిపోయాయి. ఫలితంగా అన్ని దేశాల ప్రజల బడ్జెట్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. మధ్యలో కొద్ది రోజులు యుద్ధానికి విరమణ ఇవ్వడంతో కాస్త పరిస్థితి మారింది. మళ్లీ యుద్ధం మొదలు కావడంతో మొదటికి వచ్చింది. దీంతో మళ్ళీ ధరలు పెరగడం ప్రారంభమైంది.
పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధం జరగడం వల్ల కమర్షియల్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటి ధరలను కేంద్రం తగ్గించింది. శనివారం కమర్షియల్ సిలిండర్ ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధర ప్రకారం హైదరాబాద్ నగరంలో 19 కిలోల ఎల్పిజి సిలిండర్ మీద 192 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 2999 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీ నగరంలో 202.. కోల్కత్తా నగరంలో 209 రూపాయల ధర తగ్గింది. డొమెస్టిక్ సిలిండర్ల విషయంలో మాత్రం ఇంతవరకు కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి ఆయా నగరాల ఆధారంగా ధర కొనసాగుతోంది.
ఒకవేళ యుద్ధం ఇదే తీరుగా సాగుతూ ఉంటే భవిష్యత్తు కాలంలో ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సరఫరా వ్యవస్థల మీద తీవ్రమైన ఒత్తిడి ఉందని.. రిఫైనరీలు ధ్వంసం అయ్యాయని.. ఉన్న రిఫైనరీల మీద ఆంక్షలు ఉన్నాయని.. అలాంటప్పుడు ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించిన ప్రభుత్వం.. డొమెస్టిక్ సిలిండర్ల ధర విషయంలో మాత్రం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ధర తగ్గిస్తే మాత్రం ప్రజలకు ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో.. కేంద్రం సిలిండర్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.