Reels Scam: నేటి సోషల్ మీడియా కాలంలో సెలబ్రిటీ కావాలి అంటే కచ్చితంగా రీల్స్ లేదా షార్ట్స్ చేసి ఉండాలి. అందులో చూపించిన ప్రతిభ ఆధారంగానే అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకున్నవారు సెలబ్రిటీ అవుతున్నారు. చాలామంది ఇలానే సినిమాలలో అవకాశాలు సంపాదించుకొని.. తారలుగా వెలుగొందుతున్నారు.
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. అందులో కనిపించేది ఏది కూడా నిజం కాదు. కాకపోతే సినిమా తారలను మన సమాజం డెమీ గాడ్స్ లాగా చూస్తూ ఉంటుంది. సినిమాలలో నటించేవారు అపరిమితమైన డబ్బును సంపాదిస్తారు. సమాజంలో పేరును పొందుతారు. ప్రఖ్యాతలు విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కాయిన్ కు ఒక వైపు మాత్రమే. మరోవైపు కనిపించని చీకటి కోణం ఉంటుంది.
సెలబ్రిటీ హోదా.. డబ్బు.. ఫేమ్ ఇలా చాలా ఉంటాయి.. కానీ వీటి వెనక కనిపించని మోసం ఉంటుంది. ఇటీవల కాలంలో సినిమా దర్శకులు.. నిర్మాతలు వర్ధమాన తారలకు అవకాశాలను రీల్స్.. షాట్స్ చూసి ఇస్తున్నారు. అయితే ఈ జాబితాలో అందరూ శుద్ధ పూసలు కాదు. కొంతమంది దర్శకులు… నిర్మాతలు వేరే యావను కలిగి ఉంటారు.. రీల్స్ చూసి.. షార్ట్స్ చూసి వెంటనే ఫోన్ చేసి.. అవకాశాలు ఇస్తామని చెబితే అనుమానించాలి. ముఖ్యంగా వారు మాట్లాడే విధానం దారుణంగా ఉంటుంది. అవకాశాలు ఇస్తామని గెస్ట్ హౌస్ రమ్మని చెబుతారు. ఆ తర్వాత వాంఛలు తీర్చుకొని వదిలేస్తారు. అప్పటికి నెత్తినోరు మొత్తుకున్నప్పటికీ ఉపయోగముండదు.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఓ మహిళ ఆవేదనతో చెప్పింది. ఉదాహరణలతో వివరిస్తూ సినిమా ప్రపంచం ఎంత దారుణంగా ఉంటుందో పేర్కొంది..” మీరు సోషల్ మీడియాలో షార్ట్స్ బాగా చేస్తారా.. రీల్స్ బాగా చేస్తారా.. మీకు ఫాలోవర్స్ బాగా ఉన్నారా.. ఇంకేముంది ఏదో ఒక దర్శకుడు లేదా నిర్మాత నుంచి ఫోన్ వస్తుంది. మీకు పలానా సినిమాలో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు.. మీరు కచ్చితంగా రండి అంటారు. ఆ తర్వాత ఒక నిర్మానుస్యమైన అడ్రస్ చెబుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా వ్యవహారాలు ఏవి ఉండవు. మీ దేహంతో ఆడే ఆటలు మాత్రమే ఉంటాయి. ఆటలు మొత్తం ఆడుకున్నాక బయటికి పంపిస్తారు. గట్టిగా మాట్లాడితే నోరు నొక్కుతారు. మీ మీద రకరకాల దుష్ప్రచారాలు చేస్తారని” ఆ మహిళ ఇన్ ఫ్లూయన్సర్ చెప్పింది. ఇప్పుడు ఆమె మాటలు వైరల్ గా మారాయి. అంతేకాదు సినిమా అవకాశాల కోసం వెంపర్లాడే యువతకు ఒక గుణపాఠం లాగా ఉన్నాయి.
మీ రీల్స్ చూసి సినిమా ఛాన్స్ వచ్చింది అంటే..
అది మిమ్మల్ని శారీరకంగా వాడుకోవడానికే!
– అమ్మాయి వీడియో వైరల్ #CastingCouch #Tollywood pic.twitter.com/D8eHm30WAg
— UttarandhraNow (@UttarandhraNow) August 5, 2026