Homeఆంధ్రప్రదేశ్‌Jagan Vs ABN: ఏబీఎన్ పై జగన్ నిషేధం... యూట్యూబ్లో ఆ చానల్ సూపర్ హిట్

Jagan Vs ABN: ఏబీఎన్ పై జగన్ నిషేధం… యూట్యూబ్లో ఆ చానల్ సూపర్ హిట్

Jagan Vs ABN: కొన్ని కొన్ని సార్లు మనం తెలిసి చేసిన పనులు శత్రువులకు అమితమైన బలాన్ని కలిగిస్తాయి. సరిగ్గా ఇలాంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. అనక తన గురించి ఈరోజు పేజీలకు పేజీలు వార్తలు రాసి, గంటలకు గంటలు చర్చావేదికలు పెట్టి ఇబ్బంది పెడుతున్న రాధాకృష్ణ తల మీద పాలు పోశారు. నిషేధం పేరుతో ఆయనను ఎక్కడో జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లారు. ఫలితంగా ఈ క్రేజ్ ను ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ దర్జాగా క్యాష్ చేసుకుంటున్నారు.

లొసుగులను బయట పెట్టడంలో .

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు ఆయన పాలనలోని లొసుగులను బయట పెట్టడంలో ఆంధ్రజ్యోతి ముందు వరుసలో ఉంది. అయితే ఒక్కోసారి ఇది కట్టు తప్పుతోంది. ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నలు సంధించడం సరైనప్పటికీ.. అది శృతిమించడం వల్లే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జగన్ పాలన విషయంలోనూ రాధాకృష్ణ ఇలానే వ్యవహరిస్తుండడం, చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేందుకు ఆయన మరింత రెచ్చిపోతుండడంతో..జగన్ కు పీకలదాకా కాలుతోంది. అందుకే తన వ్యతిరేకమైన స్వరం వినిపిస్తున్న ఏబీఎన్ పీక నొక్కాలి అని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే కేబుల్ కనెక్షన్లలో ఆ ఛానల్ రాకుండా చేశాడు. ఎం ఎస్ వో లతో మాట్లాడి అసలు ఆ ఛానల్ టాప్ 100 జాబితాలో కూడా లేకుండా చేశాడు.. ఎలాగైనా ఏబీఎన్ ఛానల్ పై అప్రకటిత నిషేధం విధించామని సంబరపడుతున్న జగన్ కు యూట్యూబ్ రూపంలో రాధాకృష్ణ షాక్ ఇచ్చాడు. అంతేకాదు దానిని తనకు అనుకూలంగా మార్చుకొని ఏకంగా జాతీయస్థాయిలో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు.

యూట్యూబ్ ద్వారానే..

స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ యూట్యూబ్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. వార్తల నుంచి వినోదం వరకు అందులోనే చూసేస్తున్నారు. ఒకప్పుడు శాటిలైట్ ద్వారా న్యూస్ చానల్స్ కు ఆదాయం ఉండేది. కానీ దానిని మించేలా మారిపోయింది యూట్యూబ్. జగన్ ఎప్పుడైతే నిషేధం విధించాడో అప్పుడే ఏబీఎన్ నెత్తిలో పాలు పోసినట్టు అయింది. చాలామంది ఏబీఎన్ ప్రసారాల కోసం యూట్యూబ్ ను ఆశ్రయించడంతో అది ఏకంగా జాతీయస్థాయిలోకి వెళ్ళింది.. ఫోన్లలో యూ ట్యూబ్ లో ఇండియాలో న్యూస్ ఛానల్స్ రేటింగ్స్ లో ఏకంగా జాతీయస్థాయిలో నాలుగు స్థానానికి చేరుకుంది. జీ న్యూస్, ఆజ్ తక్, టీవీ9 మరాఠీ తర్వాత ఏబీఎన్ ఛానల్ నిలిచింది. గతంలో 20 స్థానాల తర్వాత ఎక్కడో ఉండేది. కానీ వివేకా నందా రెడ్డి కేసు పరిణామాలు, ప్రభుత్వం చేస్తున్న కొన్ని కొన్ని విషయాలను తమకు తెలియకుండా కట్టడి చేయడం.. వీటిని ఆంధ్రజ్యోతి తెలివిగా బయట పెట్టడంతో .. జనం ఆ ఛానల్ చూసేందుకు ఇష్టపడుతున్నారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఇదే స్థాయిలో నిషేధం విధించినప్పుడు ఏబీఎన్ ఛానల్ చూసేందుకు జనం ఎగబడేవారు..

దూసుకెళ్తోంది

ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి ఉండడంతో ఆ ఛానల్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. పైగా ఇలా బ్యాన్ చేయడం వల్ల ఏబీఎన్ పై జగన్ సాధించింది ఏమీ లేదు.. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. అయినప్పటికీ బహిరంగ సమావేశాల్లో ఆ ఛానల్ పేరు ప్రస్తావిస్తూనే ఉన్నారు. అలా ఆయన చెప్పడం వల్ల.. ఆయన కూడా అదే చానల్ చూస్తారేమోననే అభిప్రాయాన్ని జనాలు కలిగిస్తున్నారు. కారణం ఏదైనప్పటికీ తన విపరీతమైన చేష్టలతో మరింత బలోపేతం చేస్తున్నారనే అపవాదు లేకపోలేదు. ఏది ఏమైనా పడితే జగన్ తన పైన విధించిన నిషేధంతో రాధాకృష్ణ మరింత రెచ్చిపోతున్నాడు. యూట్యూబ్లో ఏకంగా జాతీయస్థాయికి ఎదిగాడు. ఇదే సమయంలో ప్రకటనల ఆదాయం పెంచుకొని మరింత ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాడు. మరి ఈ పరిణామంతో జగన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular