Nara Lokesh : సీఎం జగన్ పాలనలో నష్టపోయింది సొంత సామాజికవర్గమేనా? రెడ్డి సామాజికవర్గం వారు దారుణంగా వంచనకు గురయ్యారా? జగన్ ఆ నలుగురి రెడ్లకే ప్రాధాన్యమిస్తున్నారా? టీడీపీ యువనేత నారా లోకేష్ ఇటువంటి ఆరోపణలే చేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఇటీవల సీఎం జగన్ పై ఆరోపణలు చేశారు. జగన్ ఏలుబడిలో రెడ్డి సామాజికవర్గం వారు ప్రధాన బాధితులుగా మిగిలిపోయారని ఆరోపించారు. సీఎం జగన్ సహా వైవీ సుబ్బారెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి మాత్రమే వైసీపీ ప్రభుత్వ పాలనలో బాగుపడ్డారని చెప్పుకొచ్చారు. కేవలం నలుగురు రెడ్లకు మాత్రమే కేబినెట్‌లో అవకాశం కల్పించడం దురుద్దేశ్యం ఉందని కూడా అన్నారు. అక్కడితో ఆగకుండా జగన్ సొంత సామాజికవర్గం వారినే వేధిస్తున్నారని ఆరోపించారు. అటువంటి వారిని టీడీపీ అధికారంలోకి వస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అయితే నారా లోకేష్ గతాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు పాలనలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకోవాలసిన అవసరం ఉంది. అప్పటి విపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారంటూ విద్యుత్ సంస్థ చైర్మన్ గా ఉన్న రమాకాంత్ రెడ్డిని ఎలా వేధించారో గుర్తు తెచ్చుకోవాలి.అలాగే సీనీయర్ ఐపీఎస్ అధికారిగా, సర్వీసులో ఏ మచ్చ లేకుండా ఉన్న డీజీపీ ఆంజినేయ రెడ్డిని కేవలం కుల వివక్ష కారణంగా వేధించి ఆయనను పక్కన పెట్టి పేర్వారం రాములుకు అవకాశం ఇచ్చిన సందర్భం ఒకటుంది. మరో ఐపీఎస్ అధికారి దినేష్ రెడ్డి ని కేవలం కుల వివక్షతో నాలుగేళ్ళు పక్కన పెట్టారు.ఇంకో ఐపీఎస్ అధికారి గోపీనాథ్ రెడ్డి కూడా చంద్రబాబు పాలనలో కుల వివక్షకు గురయ్యారు.అధికారులే కాదు చంద్రబాబు హయాంలో చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని కేసుల్లో ఇరికించారు. పోలీస్ వ్యానులో కింద పడేసి కిలోమీటర్ల కొద్దీ తిప్పి స్టేషన్లో పెట్టి కొట్టించిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం కులం పేరుతో చంద్రబాబు వేధించిన రెడ్డి అధికారుల లిస్ట్ చాలానే ఉంది. కానీ ఎల్లో మీడియాకు ఇవేవీ కనిపించలేదు. యువనేత లోకేష్ సైతం వీటిపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వాస్తవానికి 2009 తరువాత లోకేష్ పరోక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు తన తండ్రి హయాంలో జరిగిన పరిణామాలేవీ ఆయనకు తెలియడం లేదు. అందుకే తన తండ్రి రెడ్డి సామాజికవర్గానికి న్యాయం చేసిన నేతగా నేతగా ఊహించుకుంటున్నారు. కానీ చంద్రబాబు హయాంలో రెడ్డి సామాజికవర్గం తీరని దగాకు గురైందన్న ఆరోపణలు ఉన్నాయి.
అధికారం కోసం రెడ్లపై ప్రేమ నటించడం ఆ తరువాత రెడ్లను అన్ని రకాలుగా దాడులు చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్యని తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళు కాదు జనాలు. అంతెందుకు.. రెడ్ల మీద అవాజ్యమైన ప్రేమ చూపుతున్న లోకేష్ ఆయన తండ్రి సాక్షాత్ జగన్ మోహన్ ను ఎలా టార్గెట్ చేశారో లోకానికి తెలుసు. తనతోపాటు ఎల్లోమీడియా సాయంతో తన చెంచా కులానికి కొమ్ము కాసే కొందరు అధికారులతో కలిసి అధికారులతో కలిసి జగన్, దివంగత వైయస్సార్ వ్యక్తిత్వాలను ఎంతలా దిగజార్చి రాక్షసానందం పొందారో మర్చిపోయినట్టున్నారు. అవసరానికి ఒకలా అవసరం తీరాక మరోలా వ్యవహరించడం చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఆ విషయాన్ని లోకేష్ మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.