Homeఎంటర్టైన్మెంట్Newton's Third Law Movie Review : 'న్యూటన్స్ థర్డ్ లా' ఫుల్ మూవీ రివ్యూ......

Newton’s Third Law Movie Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు సుమంత్ ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి ఆయన ఒక సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరిస్తాడు. ఆ మూవీ సైతం కల్ట్ క్లాసికల్ సినిమాగా నిలిచిపోతుంది. తన ఎంటైర్ కెరీర్ ను చూసుకుంటే ఆయన చేసిన ప్రతి సినిమా ఒక బెస్ట్ మూవీ అనే చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ‘నూటన్స్ థర్డ్ లా’ అంటూ మరోసారి […]

అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు సుమంత్ ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి ఆయన ఒక సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరిస్తాడు. ఆ మూవీ సైతం కల్ట్ క్లాసికల్ సినిమాగా నిలిచిపోతుంది. తన ఎంటైర్ కెరీర్ ను చూసుకుంటే ఆయన చేసిన ప్రతి సినిమా ఒక బెస్ట్ మూవీ అనే చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ‘నూటన్స్ థర్డ్ లా’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

వినయ్ (త్రినాథ్ వర్మ) అనే ఒక కుర్రాడు అనుమానాస్పదంగా ఇంటి పైనుంచి పడి చనిపోతాడు. ఆయన చావు వెనక ఎవరు ఉన్నారు అనేది తెలుసుకోవడానికి వాసుదేవ్ (సుమంత్) ఈ కేసు ను టేకాఫ్ చేస్తాడు. ఇక అందులో భాగంగానే ఆయన వినయ్ వల్ల పేరెంట్స్ అయిన పార్వతి(షెల్లీ ఎన్ కుమార్), గంగాధర్ (రవి వర్మ)లను ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు అన్ని విషయాలు చెబుతుంటారు. కానీ ఇంకేదో ఒక రహస్యాన్ని దాస్తున్నారనే అనుమానం వాసుదేవ్ కి వస్తుంది… దాంతో ఆయన తన ఇంటరాగేషన్ ను మాత్రం ఎక్కడ ఆపకుండా ముందుకు వెళ్తుంటాడు. ఇక ఈ క్రమంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన స్టీఫెన్ మెర్క్యూరీ (జగపతి బాబు) చాలా మందిని చంపి పోలీసులకు దొరక్కుండా తిరుగుతుంటాడు. వినయ్ మర్డర్ కి మెర్క్యూరీ కి మధ్య సంబంధం ఉందా? అసలు వాసుదేవ్ వినయ్ మర్డర్ మిస్టరీ వెనక ఉన్న రహస్యాన్ని కనిపెట్టడా? మెర్క్యూరీ వాసుదేవ్ కి ఏదైనా సంబంధం ఉందా అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

దర్శకుడు ఈ సినిమాని చాలా ఇంటెన్స్ తో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ‘న్యూటన్స్ థర్డ్ లా ‘అనే టైటిల్ లోనే సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ప్రతి ఒక్కరు న్యూటాన్స్ థర్డ్ లా ప్రకారం ఎవరు చేసుకున్న కర్మకు వల్లే బాధ్యులు అనే పాయింట్ ను చెప్పాలనుకున్నారు. మంచి చేసిన వారు మంచి, చెడు చేసిన వారు చెడు అనుభవించక తప్పదు అనే విషయాన్ని సినిమాలో పర్ఫెక్ట్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఇక అందులో భాగంగానే మర్డర్ మిస్టరీని సైతం డిఫరెంట్ డైమెన్షన్ లలో తీసుకెళ్లిన విధానం బాగుంది. మొదటి 20 మినిట్స్ సినిమా మొత్తానికి చాలా హై ఫీల్ ఇచ్చింది. దర్శకుడు చాలా ఇంట్రెస్టింగ్ గా కథలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత మూవీ కొంతవరకు డౌన్ అయినట్టుగా అనిపించినా కూడా సెకండాఫ్ మొత్తం చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది.

కారణం ఏంటి అంటే స్క్రీన్ ప్లే ని చాలా స్పీడ్ గా తీసుకెళ్లారు. ఓవరాల్ గా ఫస్టాఫ్ ఓకే అనిపించింది సెకండాఫ్ మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఒక ట్విస్ట్ అయితే చాలా బాగా ఎలివేట్ చేస్తూ రాసుకున్నాడు. ఆ ట్విస్ట్ ని చాలా తొందరగా ముగించినట్టుగా అనిపించింది. ఇంకొంచెం లాగి ఉంటే బాగుండేది. దానికి ప్రాపర్ హై దొరికేది. దానివల్ల సీన్ ఇంకా అద్భుతంగా ఉండేదని మరి కొంత మంది కామెంట్లు చేస్తున్నారు… మొత్తానికైతే సుమంత్ ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. ఆయన చాలా ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ని ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. కొన్ని కోర్ ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా పేలింది.

ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది… ఫస్టాఫ్ లో ఒక ఆఫ్ అన్ అవర్ పాటు సినిమా చాలా స్లోగా వెళుతుంది. దానివల్ల ప్రేక్షకుడికి కొంతవరకు బోర్ కలిగే అవకాశం ఉంది. సెకండాఫ్ లో వచ్చిన సన్నివేశాలు సైతం చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా తీసినట్టుగా అనిపించింది. దానికి ఇంకొంచెం ప్రాపర్ రైటింగ్ ఉంటే అది ఇంకాస్త ఎలివేట్ అయ్యేది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

సుమంత్ యాక్టింగ్ ఈ సినిమాలో చాలా బాగుంది. తను ఇంతకుముందు చేసిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాల కంటే కూడా ఇందులో డీసెంట్ పెర్ఫార్మెన్స్ ని ఇచ్చాడు. తను ఏదైతే అనుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. దర్శకుడు చెప్పిన దానికి కట్టుబడి ఆ క్యారెక్టర్ లెంత్ ను తెలుసుకొని దాని నుంచి బయటికి రాకుండా పర్ఫెక్ట్ గా తనను తాను పోట్రే చేసుకున్న విధానం బాగుంది. ఇక అవసరాల శ్రీనివాస్ సైతం చాలా రోజుల తర్వాత చాలా మంచి పాత్రను పోషించాడు.

తన క్యారెక్టర్ లో ఉన్న ఇంటెన్స్ సినిమా మొత్తానికి చాలా బాగా హెల్ప్ అయింది… జగపతిబాబు సైతం చాలా సెటిల్డ్ యాక్టింగ్ చేశాడు. చాలా రోజుల తర్వాత జగపతిబాబు ఇలాంటి ఒక పాత్రను పోషించడం అనేది స్క్రీన్ మీద చూసిన ప్రతి ఒక్కరికి చాలా మంచి అనుభూతిని ఇస్తుంది… త్రినాధ్ వర్మ సైతం ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యాడు. తన పాత్రలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకులకు ఒక హై ఫీల్ ఇచ్చే ప్రయత్నం చేశాడు…

టెక్నికల్ అంశాలు

మ్యూజిక్ ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యింది. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందువల్లే కొన్ని సన్నివేశాలు కూడా బాగా ఎలివేట్ అయ్యాయి. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే హాలీవుడ్ స్టైల్ ఆఫ్ సినిమాటోగ్రఫీని ఫాలో అయ్యారు. ఆ కలర్ ప్యాలెట్స్ కూడా చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా ప్రతి షాట్ లో సినిమాటోగ్రాఫర్ తన ఇంటెన్స్ ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. అనవసరమైన బ్లాక్స్ లేకుండా సినిమాకి ఎంతవరకు ఎలాంటి షాట్స్ కావాలో వాటిని మాత్రమే డిజైన్ చేసుకొని సినిమాని చేసినట్టుగా తెలుస్తుంది…

ప్లస్ పాయింట్స్

సుమంత్ యాక్టింగ్
ట్విస్టులు
బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ బోరింగ్ గా ఉన్నాయి..
సెకండాఫ్ ను చాలా ఫాస్ట్ గా చుట్టేశారు…

రేటింగ్ : 2.5/5

ఫైనల్ వర్డ్: ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు నచ్చే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper