Newton’s Third Law Movie : సుమంత్ హీరోగా చేసిన న్యూటన్స్ థర్డ్ లా మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఈ సినిమాని చూడడానికి చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడానికి గల కారణం ఏంటి అంటే ఈ సినిమాలో కొన్ని హైలెట్ పాయింట్స్ ఉన్నాయి. సుమంత్ యాక్టింగ్ సినిమాలో చాలా బాగుంది. దానికి తగ్గట్టుగానే కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని ట్విస్టులు కూడా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తున్నాయి. దానివల్ల ఈ సినిమాని చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఇంతకుముందు సుమంత్ చేసిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ల కంటే కూడా ఈ సినిమా చాలా బాగుందని సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సుమంత్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఒక కొత్త తనుభూతిని నింపుతుంటాయి. గత సంవత్సరం ‘అనగనగా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పేరెంట్స్ ఎలా ఉండాలి.
పిల్లల పట్ల పేరెంట్స్ అనుసరించే వైఖరి ఏంటి అనేదాన్ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమాతో సైతం ప్రేక్షకులను మరోసారి మెప్పించిన సుమంత్ మరికొద్ది రోజుల్లో మహేంద్రగిరి వారాహి అనే సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు…
మొత్తానికైతే ఈ సినిమా ఒక డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాగా నిలిచిపోయింది…ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతుంది. సుమంత్ సినిమాలన్నింటి కంటే కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…