spot_img
Homeఆంధ్రప్రదేశ్‌రఘురామతో చంద్రబాబు.. ఎప్పటికైనా డేంజరే?

రఘురామతో చంద్రబాబు.. ఎప్పటికైనా డేంజరే?

Chandrababu Raghu rama rajuఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలపండిన నేతగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును చెప్పుకోవచ్చు. గతంలో ఆయన నిర్ణయాలతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఉన్నా రాను రాను రాజుగారి గుర్రం గాడిదయింది అన్న చందంగా మారాయి. ఆయన ఆలోచనల్లో కొత్త దనం లేకుండా పోతోంది. పైగా చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారనే మరో ఆరోపణ కూడా చోటుచేసుకుంటోంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయాలనే తపనతో ఓటుకునోటు కేసులో అడ్డంగా బుక్కయి అభాసు పాలయ్యారు. ఇప్పుడు తాజాగా రఘురామ కృష్ణంరాజు కేసులో తలదూర్చి తలనొప్పులు తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి రఘురామను వాడుకుంటున్నారనే అపవాదు మూటకట్టుకుంటున్నారు. చంద్రబాబు కుట్రలను వైసీపీ ఇన్నాళ్లు కనిపెట్టలేకపోయిందా అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై చంద్రబాబును బాధ్యుడిని చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ భావిస్తున్నా అది నెరవేరేలా కనిపించడం లేదు. ఎంపీ రఘురామ విషయంలో టీడీపీ బహిరంగంగానే మద్దతునిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేత జగన్ ప్రతిష్టను దిగజార్చడమే ఉద్దేశంగా టీడీపీ కుట్రలు చేస్తుందని బహిరంగంగా వైసీపీ ఆరోపిస్తోంది.

జగన్ బెయిల్ రద్దు విషయంలో న్యాయసలహాలను బాబు నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేసినట్లు వైసీపీ భావిస్తోంది. అయితే చంద్రబాబును దోషిగా నిలబెట్టి తమ ప్రయోజనాలు సాధించుకోవాలని వైసీపీ తలపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బతీయాలనే ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కూడా ఇదే తరహాలో నోటుకు ఓటు కేసులో చంద్రబాబు తలదూర్చి అపహాస్యం పాలైనట్లు తెలుస్తున్నా ఆయనలో మార్పు రాకపోవడం గమనార్హం.

ఈ వ్యవహారంపై పట్టించుకోవాల్సిన కేంద్రం చోద్యం చూస్తోంది. ఇందులో ఇద్దరికి నష్టం జరిగినా తమకే లాభం చేకూరుతుందని భావిస్తున్నట్లు సమాచారం. జగన్, చంద్రబాబు నాయుడు పరస్పర కలహాలతో నాశనమైతే తమ పార్టీ బీజేపీకి ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుందని చూస్తోంది. అందుకే వీరిద్దరి వ్యవహారంలో తలదూర్చక రఘురామపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. మొత్తానికి ఈ వ్యవహారంలో బీజేపీ స్తబ్దుగా ఉండడంపై ఇరు పార్టీలు సైతం పట్టించుకోవడం లేదు. తమ అంతర్గత కలహాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper