Motorola g37 Power: ఈ కామర్స్ సైట్లు నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని అన్ని ఉత్పత్తుల మీద తగ్గింపులు ప్రకటించాయి. ఇందులో మోటరోలా కంపెనీకి సంబంధించిన స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. అందులో మోటరోలా g37 పవర్ అనే మోడల్ మీద అద్భుతమైన డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ధర.. ఇందులో ఉన్న ఫీచర్లు.. ఈ కథనంలో తెలుసుకుందాం..
15,699 కు లభిస్తోంది
మోటరోలా g37 పవర్ ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు 26,499 ధరలో లభించింది. ఇప్పుడు ఆ ఫోన్ ధర 15,699 కు లభిస్తోంది. మొత్తంగా 41 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ మోడల్ ఫోన్ లో అనేక రకాలైన ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను ఇందులో పొందుపరచడం విశేషం. వాస్తవానికి అన్ని కంపెనీలు ధరలు పెంచుతున్న నేపథ్యంలో.. మోటరోలా మాత్రం ధరను తగ్గించడం విశేషం.
డిస్ ప్లే
- ఈ ఫోన్ 6.7 ఇంచుల హెచ్ డీ+ ఎల్ సీ డీ స్క్రీన్ కలిగి ఉంది..
- రీ ఫ్రెష్ రేట్ 120 Hz ఉండడం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ సులభంగా సాగిపోతాయి.
- స్క్రీన్ పరిరక్షణ కోసం పటిష్టమైన Corning Gorilla glass 7i ఏర్పాటు చేశారు.
- 1050 నిట్స్(పిక్ బ్రైట్నెస్) వరకు సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ, చార్జింగ్
- ఈ ఫోన్లో ఉన్న ప్రధాన హైలెట్ బ్యాటరీ. ఇందులో 7000 mAh భారీ బ్యాటరీ ఉంది. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే సాధారణ వాడకంలో దాదాపు మూడు రోజుల బ్యాక్అప్ ఇస్తుంది.
- 30W టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.
- 6W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ద్వారా ఈ ఫోన్ నుంచి ఇతర డివైస్ లకు చార్జింగ్ చేసుకోవచ్చు.
పెర్ఫార్మన్స్ & సాఫ్ట్వేర్
- ఈ మొబైల్ మీడియా టెక్ డైమన్ సిటీ 6400 అక్టా కోర్ 5జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఫలితంగా రోజువారీ పనులు.. మల్టీ టాస్కింగ్ వేగంగా చేయవచ్చు.
- ఇందులో స్టోరేజ్ 4 GB/ 8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో లభిస్తుంది. మైక్రో ఎస్డి కార్డు ద్వారా వన్ టీవీ వరకు పెంచుకోవచ్చు.
- 50 మెగాపిక్సల్ ప్రాథమిక AI కెమెరా(f/1.8 aperture) ఏర్పాటు చేశారు. ఇందులో 2k వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.
- ఫ్రంట్ కెమెరా సెల్ఫీలకు.. వీడియో కాల్స్ కు అనుకూలంగా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాఫిక్సల్ సామర్థ్యంతో ఉంటుంది..
- ఇది MIL STD 810 H మిల్ట్రీ గ్రేడ్ సర్టిఫికేషన్.. ఐపీ 64 డస్ట్, స్ఫ్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది.
- అద్భుతమైన సౌండ్ అనుభూతి కోసం డాల్బీ అటామస్ సపోర్ట్ గల స్టీరియా స్పీకర్లు ఇందులో ఉన్నాయి.
- బ్లూటూత్ 5.4, వైఫై 5, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, సైడ్ మాంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఉంది.