Husband revenge on Cheating wife: నేటి కాలంలో వివాహ బంధాలు పలచనవుతున్నాయి. భార్యాభర్తల మధ్య దృఢంగా ఉండాల్సిన సంబంధాలు మాయమైపోతున్నాయి. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని .. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా భార్య భర్తలు ఇతర సంబంధాల మాయలో పడుతున్నారు. తద్వారా తమ వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నారు. నచ్చిన వాళ్ళతో లేచిపోతున్నారు. అన్ని సంవత్సరాలపాటు కలిసి సాగించిన బంధానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త సంబంధాలకు తహతహలాడుతున్నారు. అవి పెను విపత్తులకు దారితీస్తున్నాయి.. కుటుంబ సభ్యుల మధ్య అగాధాలను పెంచి దారుణాలకు కారణమవుతున్నాయి. అయితే బీహార్ రాష్ట్రంలో జరిగిన సంఘటన మాత్రం చాలా విచిత్రమైనది. ఒక రకంగా దీనిని వివాహేతర సంబంధాలలో సరికొత్త బంధం అనుకోవచ్చు.
బీహార్ రాష్ట్రంలో ఖగారియ అనే జిల్లా ఉంది. ఈ జిల్లాకు చెందిన నీరజ్ అనే వ్యక్తికి 2009 లో రూబీ దేవి అనే మహిళతో వివాహం జరిగింది.. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. 11 సంవత్సరాల పాటు నీరజ్, రూబీ సంసారం చక్కగా సాగిపోయింది. వీరికే నలుగురు పిల్లలు కూడా.. సాఫీగా సాగిపోతున్న మీరు సంసారంలోకి ముఖేష్ అనే వ్యక్తి వచ్చాడు.. ముఖేష్ మాయ మాటలు చెప్పడంలో దిట్ట. రూబీ దేవికి మాయ మాటలు చెప్పి తన మాయలో పడేసుకున్నాడు. నిత్యం రూబీ దేవి ముఖేష్ తో మాట్లాడుతుండడంతో నీరజ్ కు అనుమానం కలిగింది.. ఆ తర్వాత అతని అనుమానం నిజమైంది.. 2022లో పిల్లల్ని వదిలేసి రూబీ దేవి తన ప్రియుడు ముఖేష్ తో వెళ్లిపోయింది. దీంతో అప్పటినుంచి నీరజ్ షాక్ లో ఉండిపోయాడు.. పైగా పిల్లల్ని తన వద్ద ఉంచి వెళ్లిపోవడంతో మరింత ఆవేదనలో కూరుకు పోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారి జాడ కనిపించలేదు.. ఈ క్రమంలో నీరజ్ తనకు జరిగిన అన్యాయంపై కుల పెద్దలను కలిశాడు. అనేక పర్యాయాలు పంచాయతీలు పెట్టించాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. ఈ క్రమంలో ముఖేష్ గురించి అతడు ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ముఖేష్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.
ముఖేష్ కు అప్పటికే వివాహం జరిగింది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా. నీరజ్ ముఖేష్ భార్య వద్దకు వెళ్లాడు. జరిగిన విషయం మొత్తం చెప్పాడు.. దీంతో ఆమె చాలా బాధపడింది. ఆ తర్వాత ఆమె ముందు పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు నీరజ్.. దానికి ముఖేష్ భార్య ఒప్పుకుంది.. వారిద్దరు పెళ్లి చేసుకున్నారు.. అంతేకాదు తన భార్యను లేపుకొని వెళ్లిన వ్యక్తి భార్యను పెళ్లి చేసుకొని నీరజ్ ప్రతీకారం తీర్చుకున్నాడు.. వాస్తవానికి ఈ సంఘటన జరిగి చాలా రోజులవుతున్నప్పటికీ.. ఇప్పటికీ ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది.. ఎందుకంటే జనాలకు ఇటువంటి వార్తలంటేనే చాలా ఇష్టం కాబట్టి.