Keeravani mistake: సినిమా ఇండస్ట్రీలో బంధాలు బంధుత్వాల మీద ఎవరు పెద్దగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే ఎవరికి అవసరం ఉన్నంతవరకు మాత్రమే వాళ్లు వాడుకుంటారు అనే మాట ఇండస్ట్రీ లో ఎక్కువగా వినిపిస్తోంది… కొంతమంది మాత్రం పర్సనల్ గా బాండింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు… ఇక రీసెంట్ గా అందె శ్రీ చనిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇక చాలా మంది సినిమా మేధావులు సైతం అతని పార్థివ దేహాన్ని చూసి నివాళులను అర్పించి తన కుటుంబాన్ని పరామర్శించారు. కానీ కీరవాణి మాత్రం ఎక్కడా కనిపించలేదు. కారణమేంటి అనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు. నిజానికి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటకి కీరవాణి ట్యూన్ అందించాడు.అది ఏమాత్రం ఎఫెక్టివ్ గా అనిపించలేదు.
అయినప్పటికి ఆ పాట మీద కీరవాణి మీద వచ్చిన విమర్శలను పర్సనల్ గా తీసుకొని కీరవాణి మీద ఎలాంటి ఇబ్బంది కలగకుండా తనకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అయిన నువ్వు రాసిన పాటకి ట్యూన్ కట్టడానికి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు దొరకలేదా అనే విమర్శను కూడా ఎదుర్కొన్నాడు. అయిన కూడా దాన్ని అందె శ్రీ పర్సనల్ గా తీసుకున్నాడు.
అలాంటి వ్యక్తి చనిపోతే కీరవాణి కనీసం నివాళులర్పించాల్సిన అవసరమైతే ఉంది కదా! వీళ్ళు పైసల కోసమే బంధాలను ఏర్పాటు చేసుకొని పైసల కోసమే వ్యక్తులను వాడుకునే రకమా అంటూ చాలామంది కీరవాణి వైఖరి మీద విమర్శలను గుప్పిస్తున్నారు…ఇక ఇప్పటికైనా ఆయన మారితే బాగుంటుంది. లేకపోతే మాత్రం చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇప్పటికైనా ఈ విషయం మీద స్పందించి తను ఎందుకు ఆరోజు అటెండ్ అవ్వలేకపోయాడనే విషయం మీద క్లారిటీ ఇస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం… తను ఇంకా అజ్ఞాతంలోనే ఉంటే విమర్శలకు తావిచ్చిన వాడవుతాడు. తొందరగా ఈ విషయం మీద రెస్పాండ్ అయితేనే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఆయన భారీ విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితైతే రావచ్చు…