Today August 8 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోని అదృష్టం వరించనుంది. మరి కొన్ని రాశుల వారు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు కొత్త బాధ్యతలను చేపడతారు. వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణ ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువుల కొనుగోలు విషయాన్ని వాయిదా వేసుకోవడం మంచిది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పెట్టుబడును పెట్టే అవకాశం ఉంది. అయితే దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు సాధారణ లాభాలు ఉంటాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతో బిజీగా మారిపోతారు. వీరికి తోటి వారి సహాయం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనవసరపు వాగ్దానాలు చేయవద్దు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉండడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అప్పులను క్లియర్ చేసేందుకు మార్గం వెతకాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు నైపుణ్య ప్రదర్శించడం ద్వారా పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవాలయాలను సందర్శిస్తారు. బంధువుల మధ్య సంబంధాలు పెరుగుతాయి. విదేశాలనుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే పెద్దలను సంప్రదించడం మంచిది. వ్యాపారులు భారీగా లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వీటిని పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. దీంతో ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందడానికి మార్గం ఏర్పడుతుంది. వ్యాపారులకు లాభదాయకమైన రోజు ఇదే అనుకోవచ్చు. అనుకోని అదృష్టం వల్ల ధన లాభం పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థికంగా వేసే ప్రణాళికలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. తొందరగా వచ్చే లాభాల గురించి ఎవరిని నమ్మకూడదు. వ్యాపారులు భాగస్వాముల సహకారంతో అధిక లాభాలు పొందుతారు. శక్తి సామర్థ్యాల మేరకు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించని లాభాలు రానున్నాయి. కొత్త వస్తువుల కొనుగోలను వాయిదా వేసుకోవడం మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడడంతో మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులను నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా పదోన్నతులు పొందే అవకాశం ఉంది
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా ఆదాయం పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తోటి వారి సహకారం ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొత్త అప్పులను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొన్ని పనులు పూర్తి కావాలంటే కష్టపడాల్సి వస్తుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. శని దేవుడు సంచారంతో అన్ని అనుకున్న పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.