Globetrotter Story: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన #Globetrotter అనే ట్యాగ్ ట్రెండ్ అవుతూ కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరెకెక్కుతున్న సినిమాకు సంబందించిన వర్కింగ్ టైటిల్ ఇది. అసలు టైటిల్ ‘సంచారి’ అని కొందరు అంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్ ని విడుదల చేశారు. అందులో ప్రారంభం నుండి ఎండింగ్ వరకు సంచారి అనే పదాన్ని ఎక్కువ గా ఉపయోగించారు. కాబట్టి ఈ సినిమాకు టైటిల్ అదే అని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు ‘వారణాసి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి, ఇప్పుడు కొత్తగా ‘సంచారి’ టైటిల్ వెలుగులోకి వచ్చింది. మరి ఈ రెండిట్లో ఏది నిజమైన టైటిల్ అనేది తెలియాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు పాటలు కంపోజ్ చేస్తున్న శంకర్ మాస్టర్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘రాజమౌళి గారు మాకు కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే వినిపించారు. ప్రతీ సన్నివేశం, ప్రతీ షాట్ ని ఆయన ఎమోషన్స్ తో సహా చేసి చూపించారు. మా మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అని అనిపించింది. అంత అద్భుతంగా ఉంది. 12 గంటలకు మేము స్టోరీ సిట్టింగ్ లో కూర్చుంటే, మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగింది. కేవలం ఫస్ట్ హాఫ్ ని వివరించడం కోసమే ఆయన నాలుగు గంటల సమయం తీసుకున్నాడు. అప్పటికే ఆయన బాగా అలిసిపోయాడు. సెకండ్ హాఫ్ తర్వాత వింటాము లేండి సార్, రిలాక్స్ అవ్వండి అని చెప్పాము. బాహుబలి లాంటి సినిమాకు మళ్లీ జీవితం లో ఒక్కసారి పనిచేస్తే చాలు అని అనుకున్నాను. కానీ ఇది బాహుబలి, #RRR చిత్రాలకు మించిన సినిమా. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అందుకునే సినిమా’ అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.
ఇదంతా పక్కన పెడితే అసలు #Globetrotter సినిమా స్టోరీ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రపంచం మొత్తం టూర్ వేసిన ఒక యువకుడు. ఎంత రిస్క్ ఉన్న ప్రాంతం లోకి అయినా వెళ్లగల మొనగాడిగా ఇందులో మహేష్ బాబు కనిపిస్తాడట. విలన్ పృథ్వీ రాజ్ చాలా పవర్ ఫుల్. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయన చేతులు, కాళ్ళు పడిపోతాయి. మళ్లీ ఆయనకు పూర్వ వైభవం రావాలంటే, మృత సంజీవని కావాలి. అది దక్షిణ ఆఫ్రికా లోని దట్టమైన, భయంకరమైన క్రూర జంతువులూ ఉండే అడవుల్లో ఉంటుంది. అక్కడికి సామాన్యులు వెళ్లడం అసాధ్యం. అలాంటి ప్రాంతానికి ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిన మహేష్ బాబు మాత్రమే వెళ్ళగలడని అతన్ని వెతికి పట్టుకొని తీసుకొస్తారు. ఆ తర్వాత జరిగే పరిణామాలే సినిమా స్టోరీ. అనుకున్నది అనుకున్నట్టు తీస్తే కచ్చితంగా ఈ చిత్రం హాలీవుడ్ సినిమాలకు పోటీ ఇవ్వగలదు. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది.