spot_img
Homeజాతీయ వార్తలుHarassment: కోటిన్నర నొక్కి.. భార్య ఏకాంతపు ఫోటోలు బయటపెట్టి..

Harassment: కోటిన్నర నొక్కి.. భార్య ఏకాంతపు ఫోటోలు బయటపెట్టి..

Husband blackmails her over obscene picsHarassment: ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుందామని ఒప్పించాడు. తీరా వివాహం చేసుకున్నాక అతడిలోని సైకో తనం బయటపడింది. మానసికంగా వేధించడం మెదలెట్టాడు. అదనపు కట్నం కావాలని చిత్రహింసలకు (Harassment) గురిచేశాడు. మొదట్లో తీసుకున్నది కూడా చిన్నా చితకా కట్నం కాదు ఏకంగా రూ. కోటిన్నర తీసుకున్నాడు. అయినా అతడిలో ధన దాహం తీరలేదు. మనిషిలో కూడా రాక్షసుడు ఉంటాడని వింటుంటాం. అది ఇతడిలో నిజమే అనిపిస్తోంది. కట్టుకున్న వాడే బ్లాక్ మెయిల్ కు దిగడంతో ఆమె చేసేది లేక పోలీసులను ఆశ్రయించిన ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనం సృష్టిస్తోంది.

బంజారాహిల్స్ ప్రాంతంలోని రోడ్ నెం. 11లో నివసించే ఓ మహిళ (24) ఎంబీఏ పూర్తిచేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. ఆమెకు సికింద్రాబాద్ లోని గన్ రాక్ ఎన్ క్లేవ్ కు చెందిన మహ్మద్ ఫర్హాన్ (26) పరిచయం ఏర్పడి అంది కాస్త ప్రేమగా మారింది. దీంతో 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో మహిళ తండ్రి రూ.కోటిన్నర కట్నంగా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అత్తింటివారి అసలు స్వరూపం బయటపడింది. అదనపు కట్నం కావాలని వేధించడం ప్రారంభించారు. మరో పక్క ఇంకా పిల్లలు కలడం లేదని సూటిపోటి మాటలతో నిత్యం బాధ పెట్టేవారు.

దీనికి భర్త కూడా వంత పాడేవాడు. ఈ క్రమంలో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. కట్టుకున్నవాడే కాలయముడు కావడంతో ఏడ్వటం తప్ప ఏ మార్గం కనిపించలేదు. కొన్నాళ్లు భరించినా ఇక లాభం లేదని అనుకుంది. పైగా భార్యతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ ఆమెను బెదిరింపులకు గురి చేశారు.

తట్టుకోలేని భార్య గురువారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్తతోపాటు అత్త మామలు అయేషా ఉస్మాన్, మహ్మద్ ఒస్మాన్ లపై వరకట్నం, వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు. మాయమాటలతో నమ్మించి పెళ్లి చేసుకున్నాక ఇలా చేయడంలో ఆమె కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper