Homeజాతీయ వార్తలుచావుబతుకుల్లో భర్త.. వీర్యం కోసం భార్య

చావుబతుకుల్లో భర్త.. వీర్యం కోసం భార్య

Gujarat High Courtఇదో విచిత్రమైన సంఘటన. భర్త నుంచి ఓ భార్య కోరుకుంటున్న కోరిక విచిత్రమైనది. కరోనా ప్రభావంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతుంటే ఆ భార్య మాత్రం ఓ వెరైటీ కోరిక కోరింది. ఏ ఇల్లాలుకు తగిన విధంగా ఆ భార్య తన మనసులోని ఆశ బయటపెట్టింది. భర్త కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే ఆమె తల్లి కావాలని భావించింది. తన భర్త వీర్యంతో తల్లి కావాలనుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో ఆస్పత్రి వర్గాలు ఒప్పుకోలేదు. చివరికి ఆమె కోర్టును ఆశ్రయించింది.

గుజరాత్ రాష్ర్టంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వడోదరాకు చెందిన ఓ మహిళకు ఏడాది క్రితం పెళ్లయింది. ఇటీవల ఆమె భర్త కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. తన అవయవాలన్ని దెబ్బ తిన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతడు కోలుకోవడం కష్టమే అని తెలుస్తోంది.

అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఏర్పడింది. తమ భార్యాభర్తల అనుబంధానికి ఓ గుర్తు ఉండాలని ఆ మహిళ కోరుకుంటోంది. తన భర్త నుంచి వీర్యం సేకరించి తనకు పిల్లలు కలిగేలా చూడాలని కోరింది. తన భర్త నుంచి సేకరించిన వీర్యంతో ఐవీఎఫ్ పద్దతిలో తల్లి కావాలని భావించింది. కానీ కరోనా బాధితుడి నుంచి వీర్యం సేకరించేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి. కోర్టు ఆదేశిస్తే చేస్తామని తెలిపాయి. దీంతో ఆ మహిళ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది.

కోర్టు కూడా ఆ మహిళ కోరికను పరిగణనలోకి తీసుకుంది. ఆ పేషెంట్ నుంచి వీర్యం సేకరించి భద్రపరచాలని సూచించింది. ఐవీఎఫ్ ద్వారా గర్బం దాల్చేందుకు అతడి బార్యకు అందించింది. ఆమెకు సహకరించాలని తెలిపింది. దీంతో ఆ మహిళ కోరిక తీరే అవకాశం దక్కడంతో హర్షం వ్యక్తం చేసింది. మొత్తానికి విచిత్రమైన కోరిక తీరినందుకు సంతృప్తి వ్యక్తం చేసింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper