woman : ఢిల్లీలోని మహిళలకు నెలవారీ రూ.1,000 సహాయం అందిస్తారట. దీనికి ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభించారు. దీనికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. ఎన్నికల తర్వాత ఆ మొత్తాన్ని రూ.2,100కి పెంచుతామన్నారు. దీని కోసం 2024-25 బడ్జెట్‌లో రూ.2,000 కోట్లను కేటాయించబోతుంది ప్రభుత్వం. మరి ఈ పథకంతో ఎవరు ప్రయోజనం పొందుతారు. ఎవరు అర్హులు వంటి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చా?ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 13 నుంచి ఈ పథకం కింద రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు మాన్యువల్‌గా ఇంటింటికీ వెళ్లి మహిళల పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పోర్టల్ అందుబాటులో లేదు.
మహిళా సమ్మాన్ యోజనకు అర్హత ఏమిటి?
ఢిల్లీలో అధికారిక ఓటర్లుగా ఉన్న మహిళలు మాత్రమే దీనికి అర్హులు. అంటే ఈ మహిళా సమ్మాన్ యోజన ప్రయోజనాన్ని పొందగలరు. అంతేకాదు ముఖ్యంగా వారి వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అలాంటి వారు ఈ మహిళా సమ్మాన్ యోజన పథకం ప్రయోజనాన్ని పొందుతారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు సాయం అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఇలాంటి వారు మాత్రమే దాని ప్రయోజనాలు పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే మహిళలకు కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు ఉండాలి. ఇక గరిష్టంగా వయోపరిమితి 60 సంవత్సరాలు ఉండాలి. మహిళలకు నాలుగు చక్రాల వాహనం ఉంటే మాత్రం ఈ పథకానికి అర్హులు కారు.
ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనకు అర్హత ఏమిటి?: మహిళల వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు మాత్రమే ఉండాలి. లేదంటే ఈ అమౌంట్ కంటే తక్కువ ఉండాలి. ఆ మహిళ ఢిల్లీలో అధికారిక ఓటరు అవ్వాలి. మహిళల వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. 60 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఇక ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే 60 ఏళ్లు నిండిన వృద్ద మహిళలకు పెన్షన్‌ను ఇస్తుంది. మహిళ పేరు మీద ఎలాంటి ఫోర్ విల్లర్స్ వాహనం ఉండకూడదు. ఉంటే ఆమె పథకానికి అనర్హులు.
జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ అతిషీతో కలిసి పనిచేశాను అని తెలిపారు. ఇప్పుడు ఇది అమలు చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. తమ వైపు నుంచి ఇదొక ఉపకారం కాదని మహిళలు తమ కుటుంబాన్ని నడుపుకొంటున్నారని తెలిపారు. వారు పిల్లలకు ఎంతగానో విలువ ఇస్తున్నారని అన్నారు. కేవలం ఆ మహిళల విలువ మరింత పెంచే విధంగా ఈ పథకం ప్రవేశ పెట్టామని తెలిపారు అరవింద్ కేజ్రీవాల్. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు సహాయం చేయగలిగితే అది మన అదృష్టం అంటూ కొనియాడారు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: 2100 per woman per month how to apply
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com