Homeఎంటర్టైన్మెంట్పవర్ స్టార్ తో వనిత నాలుగో పెళ్లి.. షాక్ లో ఫ్యాన్స్ !

పవర్ స్టార్ తో వనిత నాలుగో పెళ్లి.. షాక్ లో ఫ్యాన్స్ !

వనిత విజయ్ కుమార్.. వరుస పెళ్లిల రాకుమారి అంటూ ఆమె గురించి అనేక కథనాలు, దానికి తగ్గట్టుగానే మూడు పెళ్లిళ్లు, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు, మధ్య మధ్యలో నెటిజన్లతో కామెంట్ల గొడవలు మొత్తానికి వనిత జీవన ప్రయాణం, సినీ గమనం ఇలా ఇబ్బంది కరంగా సాగుతూ ముందుకు పోతుంది. అయితే వనిత నాలుగో పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియోలో కూడా ఆమె పెళ్లి ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది. పైగా తన పెళ్లి […]

Vanitha Vijayakumar 4th Marriageవనిత విజయ్ కుమార్.. వరుస పెళ్లిల రాకుమారి అంటూ ఆమె గురించి అనేక కథనాలు, దానికి తగ్గట్టుగానే మూడు పెళ్లిళ్లు, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు, మధ్య మధ్యలో నెటిజన్లతో కామెంట్ల గొడవలు మొత్తానికి వనిత జీవన ప్రయాణం, సినీ గమనం ఇలా ఇబ్బంది కరంగా సాగుతూ ముందుకు పోతుంది. అయితే వనిత నాలుగో పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియోలో కూడా ఆమె పెళ్లి ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది. పైగా తన పెళ్లి ఫొటోను వనితనే షేర్‌ చేయడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. అసలు అభిమానులకు ఇది ఊహించని షాకిచ్చింది. ఇంతకీ వనిత పెళ్లి చేసుకుంది ఎవర్నో తెలుసా ? పవర్‌ స్టార్‌ ని. అయ్యో .. పవర్ స్టార్ అంటే తమిళంలో ఒక కామెడీ పవర్ స్టార్ ఉన్నాడు లేండి.

అతని పేరు శ్రీనివాసన్‌. మనకు సంపూర్ణేష్ బాబు ఎలాగో… తమిళ వాళ్లకు ఈ శ్రీనివాసన్ అలాగా అన్నమాట. అయితే, ఇతగాడితో వనిత పూలదండలు మార్చుకుంటున్న స్టిల్‌ ఒకటి వదలడం, అది సోషల్‌ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. అయితే ఇది నిజమైన పెళ్లి కాదు. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలోని స్టిల్‌ ఇది.

ఏది ఏమైనా వనితలో ఇంకా పెళ్లి ఆలోచనలు ఉన్నట్టు ఉన్నాయి. లేకపోతే ఇలా అబద్ధపు స్టిల్ కు ఎందుకు ఇంత హడావిడి చేస్తోంది అంటున్నారు. పాపం వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలు వైఫల్యాలతో వనిత, ప్రొఫెషనల్ గాను కెరీర్ లో ఎదగలేకపోయింది. దీనికి తోడు ఇప్పటికే చేసుకున్న మూడు పెళ్లిళ్లు ఆమెకు కన్నీళ్లే మిగిల్చాయి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper