Homeఎంటర్టైన్మెంట్Darling Re Release Collections: 'డార్లింగ్' రీ రిలీజ్ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.....

Darling Re Release Collections: ‘డార్లింగ్’ రీ రిలీజ్ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ మిస్ అయ్యిందే..

Darling Re Release Collections: వరుసగా మాస్ సినిమాలు చేస్తూ, మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ప్రభాస్(Rebel Star Prabhas) , ఆ రోజుల్లో డార్లింగ్ లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీ చేయడం అందరిని సర్ప్రైజ్ కి గురి చేసిన విషయం. ఒక మాస్ హీరో ఇలాంటి క్లాస్ మూవీ చేస్తే , బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత పెర్ఫార్మన్స్ రాదు అనేది వాస్తవం. ‘డార్లింగ్’ విషయంలో కూడా అదే జరిగింది. సాధారణమైన […]

Darling Re Release Collections: వరుసగా మాస్ సినిమాలు చేస్తూ, మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ప్రభాస్(Rebel Star Prabhas) , ఆ రోజుల్లో డార్లింగ్ లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీ చేయడం అందరిని సర్ప్రైజ్ కి గురి చేసిన విషయం. ఒక మాస్ హీరో ఇలాంటి క్లాస్ మూవీ చేస్తే , బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత పెర్ఫార్మన్స్ రాదు అనేది వాస్తవం. ‘డార్లింగ్’ విషయంలో కూడా అదే జరిగింది. సాధారణమైన అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. కానీ కాలం గడిచే కొద్దీ ఈ సినిమాకు నేటి తరం జెన్ జీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ కారణంగానే ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యాలనే డిమాండ్ విపరీతంగా ఏర్పడింది.

అలా భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలైన ఈ రీ రిలీజ్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. 6 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వచ్చిందో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 53 లక్షలు , ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి 2 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల 88 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ చిత్రానికి 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 48 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 8 కోట్ల 36 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

అయితే ఈ చిత్రం కచ్చితంగా 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అనుకున్నారు. కానీ ఆ రేంజ్ గ్రాస్ వచ్చే పరిస్థితులు మాత్రం ప్రస్తుతానికి కనిపించడం లేదు. తెలంగాణ, కోస్తాంధ్ర, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల్లో అద్భుతమైన వసూళ్లు నమోదు అయ్యాయి కానీ, ఓవర్సీస్ , సీడెడ్ ప్రాంతాల్లో మాత్రం ఈ సినిమాకు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయని , అందుకే 10 కోట్ల టార్గెట్ మిస్ అయ్యిందని అంటున్నారు. ప్రస్తుతానికి ‘ఖలేజా’ చిత్రం 10 కోట్ల 54 లక్షల రూపాయిల గ్రాస్ తో నెంబర్ 1 స్థానం లో ఉంది, ఈ రికార్డు ని ఇప్పట్లో ఎవ్వరు ముట్టుకోలేరేమో, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోయే సినిమాలు ఈ రికార్డు ని అందుకునే అవకాశాలు ఉన్నాయి .

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper