Homeజాతీయ వార్తలుపార్లమెంట్ లో కరోనా... సమావేశాల కుదింపుకు పట్టు

పార్లమెంట్ లో కరోనా… సమావేశాల కుదింపుకు పట్టు

దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుండటంతో పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాలను కుదించాలని పలువురు పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. పాఠశాలలు, థియేటర్లను మూయించడంతో పాటు ఎక్కువమంది జనం గుమికూడె సమావేశాలు, ఉత్సవాలు జరపరాదని ఆంక్షలు విధిస్తు, పార్లమెంట్ సమావేశాలను మాత్రం యధావిధిగా జరపడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

ఈ విషయమై ఉంభయసభలలోని పలువురు ఎంపీలు ఆ మేరకు ప్రభుత్వానికి సూచించినా అటువంటి ఉద్దేశ్యం లేదని అంటూ ప్రభుత్వ వర్గాలు కొట్టిపారవేస్తున్నాయి. సమావేశాలను యధావిధిగా జరపడం కోసమే ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నది.

కరోనా వైరస్‌ను నిరోధించేందుకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇచ్చేంత వరకూ పార్లమెంటును వాయిదా వేయడం మంచిదని పలువురు ఎంపీలు ఇటు ఉభయసభల్లోనూ, బయట కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ముందుకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సమావేశాలు ముగుస్తాయనే తాను అనుకుంటున్నట్టు అని బీజేపీ నేత ఒకరు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నందున సమావేశాల కుదింపు అనే ప్రశ్నే తలెత్తదని మరో బీజేపీ ఎంపీ చెప్పారు.

‘సభను నివరధికంగా వాయిదా వేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కరోనా వైరస్ బెడదపై పోరుకు సన్నద్ధమయ్యాం’ అని బీజేపీ నేత ఒకరు మీడియాకు తెలిపారు. అయితే, సభ్యుల ఆరోగ్యం చిక్కుల్లో పడకుండా చూడటం కూడా పార్లమెంటు బాధ్యతని, వచ్చే వారం సభ వాయిదా పడే అవకాశం లేకపోలేదని కేంద్ర మంత్రి ఒకరు అభిప్రాయప్డడారు.

కాగా, కరోనా వైరసి వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల కొనసాగింపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఏ ఎంపీ అయినా కరోనా వైరస్‌తో పార్లమెంటుకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు, వైరస్ ఇన్‌ఫెక్షన్ వచ్చినట్టు ఆయనకు తెలియకపోవచ్చు కూడా. అయితే, అది ఇతర ఎంపీలకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి’ అంటూ హెచ్చరించారు.

సమూహాలకు దూరంగా ఉండమని చెబుతున్న ప్రభుత్వం ఏదో ఒక రోజు పార్లమెంటు సమావేశాల కుదింపు విషయాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే ఎంపీ బాలసుబ్రమణియన్ సైతం రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, షెడ్యూల్ తేదీ కంటే ముందే పార్లమెంటును వాయిదా వేయాలని సూచించారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper