Attack On Kurnool Janasena Party Office: ఏపీలో రోజు రోజుకూ ప్రతీకార రాజకీయాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జనసేన అధిఏత పవన్ విషయంలో వైసీపీ ఎలాంటి ప్రతికారానికి పాల్పడుతుందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల రిలీజ్ విషయంలో రేట్లు తగ్గించి ఎంత టార్గెట్ చేసిందో చూశాం. ఇక ఆయన మూవీ భీమ్లానాయక్ అయిపోయాకే కొత్త జీవోను తెచ్చారు. ఇదిలా ఉండగా.. మొన్న ఆవిర్భావ సభ విషయంలో కూడా ఇలాగే జరిగింది.

జనసేన ఆవిర్భావ సభకు ఎవరూ స్థలాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. కానీ ఎట్టకేలకు ఆ సభను నిర్వహించారు. అయితే ఆ సభ తర్వాత పవన్ ఇమేజ్ భారీగా ప్రజల్లో పెరిగిపోతోంది. దీన్ని తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం మరోసారి ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా కర్నూలులోని జనసేన ఆఫీసుపై పడ్డారు వైసీపీ నేతలు.
Also Read: జగన్ ను దగ్గరి నుంచి చూస్తే.. పోసాని షాకింగ్ వ్యాఖ్యలు
జిల్లా కేంద్రంలోని గణేష్‌నగర్‌లో ఎప్పటి నుంచో ఒకే చోట ఆఫీసు కార్యాలయం ఉంది. దీన్ని స్వయంగా పవన్ ప్రారంభించారు. కాగా దీన్ని మూయించేందుకు కొందరు గుర్తు తెలయని దుండగులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా జనసేన నేతలను నిత్యం భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే జనసేన నేతలు మాత్రం ఆఫీసును మూసేయకపోవడంతో.. ఈ రోజు మరింత బరి తెగించారు వైసీపీ నేతలు.

ఏకంగా ఆఫీసు మీద దాడి చేసి లోపల ఉన్న వారిని బయటకు పంపించి, ఫర్నీచర్‌ను కూడా బయట పారేశారంట. అనంతరం ఆఫీసుకు తాళం వేశారు. అయితే ఇదంతా వైసీపీ నేతలు కావాలని చేయించారని అంటున్నారు వైసీపీ నేతలు. పైగా బిల్డింగ్ యజమాని కూడా వారితో చేరిపోయి ఖాళీ చేయించాలంటున్నారు. అయితే తాము ఐదేండ్ల వరకు అగ్రిమెంట్ రాసుకున్నామని, కానీ వైసీపీ నేతల ఒత్తిడితో యజమాని ఖాళీ చేయాలంటున్నాడంట. ఇక్కడే కాదు చాలా ప్రాంతాల్లో అద్దె బిల్డింగుల్లో ఉన్న జనసేన ఆఫీసులను ఖాళీ చేయించాలని వైసీపీ నేతలు చూస్తున్నారు. కానీ జనసేన నేతలు మాత్రం తాము అస్సలు వెనక్కు తగ్గబోమంటూ తేల్చి చెప్పేస్తున్నారు.
Also Read: బీజేపీతో యుద్ధానికి సిద్ధమవుతున్న కేసీఆర్ ?
[…] Telugu Media: సాక్షి మీడియా సంస్థ కొన్ని గొప్ప కార్యాలు చేస్తోంది. సాక్షి సీఈవోగా ఉత్తరాది వ్యక్తిని మూడేళ్ల కిందటే తీసుకొచ్చింది. కానీ చివరకు ఆయనను ఉద్యోగం నుంచి తప్పించింది. సాక్షి వ్యవహారాలు సాఫీగానే సాగుతున్నా ఆయనను మాత్రం విధుల నుంచి తీసేసింది. జగన్ కుటుంబానికి ఆప్తుడైన నవత్ రెడ్డి అనే ఆడిటర్ ను సీఈవోగా నియమించింది. దీంతో సాక్షిలో ఏం జరుగుతుందనే చర్చ సాగుతోంది. పని చేసే వారిని పంపేయడం పనికి మాలిన వారిని అందలాలెక్కించడం మామూలే అనే వాదన కూడా వస్తోంది. […]