Central Govt focus On YCP MP and MLAs:ఏపీలో వైసీపీ కీలక నేతలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టిందా? వారు అవినీతికి పాల్పడుతున్నారన్న పక్కా సమాచారం కేంద్రం వద్ద ఉందా? సరైన సమయంలో వారిపై పట్టుబిగించనుందా? త్వరలో ఎన్ ఫోర్స్ మెంట్ ప్రతాపం చూపనుందా? అంటే ఢిల్లీలోని ఏపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ సర్కారుకు చెందిన కొందరు పెద్దలు మనీలాండరింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వారిపై ఏ క్షణంలోనే ఈడీ దాడులు చేయవచ్చన్న టాక్ అయితే నడుస్తోంది. ప్రస్తుతానికి అంతా సైలెంట్ గా ఉన్న ఎదో జరుగుతుందన్న అనుమానాలైతే ఢిల్లీ వర్గాల్లో ఉంది. ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు మారే సూచనలైతే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కేంద్రం గోప్యత పాటిస్తోందని.. త్వరలో ఏదైనా జరగవచ్చని కీలక అధికారుల మధ్య అంతర్గతంగా చర్చ అయితే నడుస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరిగినట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలోని అధికార పార్టీ పెద్దలపై కేంద్రం ఫోకస్ పెంచిందన్న వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. గోప్యత వెనుక పక్కా సమాచారం సేకరించే పనిలో ఈడీ ఉందని మాత్రం అత్యంత విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. కొద్దిరోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశమైతే ఉంది.

ఆ ఎంపీ లిక్కర్ కింగ్..
ప్రధానంగా ఒక పార్లమెంట్ సభ్యుడి పేరు వినిపిస్తోంది. సదరు ఎంపీ లిక్కర్ వ్యాపారంలో ఆరితేరినట్టు ఆరోపణలున్నాయి. ఆయన ఢిల్లీ ప్రభుత్వంతో చేతులు కలపారని.. లిక్కర్ మాఫియాతో చేతులు కలిపి వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారని ఆధారాలతో సహ కేంద్రం వద్ద సమాచారం ఉంది. సదరు ఎంపీ వ్యవహార శైలిపై కేంద్రం సీరియస్ గా ఉందని సైతం తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయనపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం పావులు కదుపుతున్నట్టు సమాచారం. అవినీతి కేసుల విషయంలో కేంద్రం ఇటీవల సీరియస్ గా వ్యవహరిస్తోంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వంలో ఓ కీలక మంత్రినే నేరుగా ఈడీ అదుపులోకి తీసుకున్న సందర్భాలున్నాయి. ఇటువంటి సమయంలో ఏపీలో ఆ ఎంపీ ఆగడాలు పెచ్చుమీరుతున్న దృష్ట్యా విడిచిపెట్టకూడదన్న భావనతో ప్రభుత్వం ఉంది. ఈడీకి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Also Read: Rental Agreement: అద్దె ఒప్పందం 11 నెలలు మాత్రమే ఎందుకు చేసుకుంటారు..?
రియల్ వ్యాపారంలో ఎమ్మెల్యేలు..
మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లకు పడగలెత్తిన ఐదుగురు ఎమ్మెల్యేలపై ఈడీ గురిపెట్టినట్టు తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యేల వ్యాపారానికి పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా పెట్టుబడులు వచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఐదుగురు ఎమ్మెల్యేల గురించి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించే పనిలో ఈడీ ఉంది. ఇటీవల పార్లమెంట్ లో ఏపీలో జరుగుతున్న వ్యవహారాలు చర్చకు వచ్చాయి. సముద్ర తీరంలో ఉన్న ఇసుక, ఖనిజ సంపదను సైతం అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని టీడీపీ ఎంపీలు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏపీ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నట్టు కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేల పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. అన్ని వివరాలు తెప్పించుకున్న ఈడీ త్వరలో వారి వ్యాపారాలపై దాడులు చేసే అవకాశముంది.

సినీ ప్రముఖులపై..
మరోవైపు సినీ ప్రముఖులపై ఈడీ దాడులు చేసే అవకాశం కూడా ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు సినీ ప్రముఖుల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఢిల్లీకి సమాచారముంది. వారి ఇతరత్రా వ్యాపారాల్లో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నట్టు కూడా ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నా.. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలపై పట్టుబిగించేందుకు కేంద్రం ఈడీని ప్రయోగిస్తోందన్న టాక్ అయితే బయటకు వస్తోంది.
Also Read:Delhi Liquor Policy Scam: మద్యం వ్యాపారంలో అక్రమాలు.. ఆమ్ ఆద్మీ పార్టీ సుద్ధ పూస కాదు
[…] Also Read: Central Govt focus On YCP MP and MLAs: ఏపీలో ఎంపీ, ఐదుగురు ఎమ్… […]