Rajamouli- NTR: రాజమౌళి విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద తప్పు చేశారు. ఆయన్ని చెడుగా అర్థం చేసుకొని పప్పులో కాలేశారు. అనరాని మాటలని ఇబ్బంది పెట్టారు. నిజం ఏమిటో తెలిశాక పశ్చాత్తాప పడుతున్నారు. అదే సమయంలో రాజమౌళిని అవమానించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. విషయంలోకి వెళితే… ఆర్ ఆర్ ఆర్ చిత్ర ప్రకటన ఓ సంచలనం. అది రాజమౌళి సినిమా కావడం ఒకెత్తు అయితే నందమూరి, మెగా వారసులైన ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటించడం మరో ఎత్తు. ఈ ప్రకటనతో ఫ్యాన్ వార్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఈ ఇద్దరు హీరోల అభిమానుల్లో అనేక సందేహాలు కూడా బయలుదేరాయి.

ఆర్ ఆర్ ఆర్ లో ఎవరి పాత్ర హైలెట్ అవుతుంది. దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ లలో ఎవరికీ ప్రాధాన్యత ఇస్తాడనే చర్చ నడిచింది. రాజమౌళికి ఎన్టీఆర్ ఆప్తమిత్రుడు కావడంతో ఎన్టీఆర్ వైపే ఆయన మొగ్గుతాడని అంచనా వేశారు. తీరా సినిమా విడుదలయ్యాక సీన్ రివర్స్ అన్నమాట వినిపించింది. మూవీలో రామ్ పాత్ర భీమ్ ని గైడ్ చేస్తూ ఉండడంతో పాటు కాంప్లెక్సిటీ తో కూడుకొని ఉంటుంది. ఓ కోణంలో భీమ్ కంటే రామ్ పాత్ర బాగా ఎలివేట్ అయినట్లు అనిపించింది.
Also Read: Nagarjuna: నాగార్జునకు పైసలే ముఖ్యం పరువు కాదు…!
ఎన్టీఆర్ వీరాభిమానులకు కూడా అదే అభిప్రాయం కలిగింది. దాంతో ఫ్యాన్స్ లో గుసగుసలు మొదలయ్యాయి. మరోవైపు చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ కి సెకండ్ హీరో అంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ కలగలిపి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అసహనానికి కారణమైంది. ఇంగితం కోల్పోయిన కొందరు సోషల్ మీడియాలో రాజమౌళిని తీవ్రంగా దూషించారు.ఎన్టీఆర్ నాలుగేళ్లు ఆర్ ఆర్ ఆర్ కి కేటాయించినందుకు రాజమౌళి ఇచ్చే బహుమానం ఇదేనా అంటూ తిట్ల దండకం అందుకున్నారు.

కొందరైతే అసభ్యకర పదజాలంతో తిడుతూ సందేశాలు పంపారట. ఆ వివాదం ముగిసి చాలా రోజులు అవుతుండగా… హాలీవుడ్ ప్రముఖ మ్యాగజైన్ ది వెరైటీ… 2023 ఆస్కార్ నామినేషన్స్ అంచనా లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ కి చోటు దక్కింది. ఆస్కార్ బరిలో ఎన్టీఆర్ నిలిచే అవకాశం కలదని ఆ మ్యాగజైన్ పేర్కొంది. దీంతో ఎన్టీఆర్ పాత్రకు ఆర్ ఆర్ ఆర్ లో ఎంత వెయిట్ ఉందో బోధపడింది. రాజమౌళిని ఫ్యాన్స్ అపార్థం చేసుకున్నారని బహిర్గతమైంది. ఎన్టీఆర్ కి ఆస్కార్ అంటూ కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్… అప్పుడు రాజమౌళిని తిట్టారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని రాజమౌళికి సారీ చెప్పాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
Also Read:Puri Jagannath : పూరి జగన్నాథ్.. ఆడు మగాడ్రా బుజ్జీ!
[…] Also Read: Rajamouli- NTR: రాజమౌళికి క్షమాపణలు చెప్పాలి… … […]