Anasuya bharadwaj: వన్నె తరగని సోయగాలతో స్టార్ యాంకర్ అనసూయ మెస్మరైజ్ చేస్తుంది. స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీ ధరించిన హాట్ బ్యూటీ పరువాల జడిలో ముంచేసింది. చీరలో అనసూయ అందాలు మరింత కవ్విస్తుంటే కుర్రకారు మనసులు గతి తప్పుతున్నాయి. అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ కి అనసూయ కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతున్నారు. ఇక జబర్దస్త్ కి బై చెప్పిన అనసూయ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆమె అందాల కోసమే టీవీ ముందు కూర్చునే సౌందర్య ఆరాధకులను నిరాశపరిచింది. జబర్దస్త్ వదిలేయాలని రెండేళ్లుగా ప్రయత్నం చేస్తున్నానన్న అనసూయ అగ్రిమెంట్ ముగియగానే చక్కగా చెక్కేసింది.
Also Read: Rajamouli- NTR: రాజమౌళికి క్షమాపణలు చెప్పాలి… ఇప్పుడిదే హాట్ టాపిక్!
జబర్దస్త్ వీడడానికి అక్కడ ఎదురైన అవమానాలు కూడా ఓ కారణమని అనసూయ చెప్పడం కొసమెరుపు. కొన్ని సందర్భాల్లో తన శరీరంపై జోక్స్ వేశారు. నేను బాడీ షేమింగ్ కి గురయ్యాను. దాని వలన నాలో కలిగిన అసహనాన్ని మాత్రం చూపించలేదు. ఎడిటింగ్ లో తీసేశారని అన్నారు.

ఇటీవల చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ ని ట్రీట్ చేసే విధానంపై అనసూయ ఘాటు వ్యాఖ్యలు చేయడం విశేషం. హీరోయిన్స్ చెప్పింది చేయాలి, ఎదురు మాట్లాడకూడదు. గిల్లితే గిల్లించుకోవాలి కానీ అరవ కూడదు. ఒక దేవదాసి మాదిరి హీరోయిన్స్ పడి ఉండాలని కుండబద్దలు కొట్టారు. అనసూయ లేటెస్ట్ కామెంట్స్ సంచలనంగా మారాయి.
కెరీర్ పీక్స్ లో ఉండగా అనసూయ పరిశ్రమను విమర్శిస్తూ ఇలా మాట్లాడటం నిజంగా సాహసమే. అయితే మొదటి నుండి అనసూయ డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్. అనసూయ పొట్టి బట్టలపై లెక్కకు మించిన విమర్శలు వచ్చాయి. నా బట్టలు నా ఇష్టం, నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి బట్టలైనా వేసుకుంటా… మీకేంటని ఆమె బోల్డ్ ఆన్సర్ ఇచ్చిన సందర్భాలు అనేకం.

ఇక జబర్దస్త్ ని వీడిన అనసూయ స్టార్ మా, జెమినీ ఛానల్స్ లో యాంకర్ గా షోస్ చేస్తున్నారు. అలాగే వెండితెరపై ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన దర్జా, వాంటెడ్ పండుగాడ్ చిత్రాలు విడుదలయ్యాయి. పుష్ప 2, రంగమార్తాండ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. మరోవైపు ఆమె కొన్ని వెబ్ సిరీస్లలో నటిస్తున్నట్టు సమాచారం.
Also Read:Liger Movie: పూరి-విజయ్ దేవరకొండకు బిగ్ షాక్… ట్రెండింగ్ లో #BoycotLiger
[…] […]