spot_img
Homeజాతీయ వార్తలుతెరపైకి కుల రాజకీయాలు.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే హాట్‌ టాపిక్‌

తెరపైకి కుల రాజకీయాలు.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే హాట్‌ టాపిక్‌

Telangana MLC Elections
కులాల ప్రాతిపదికన రాజకీయాలు ఇప్పటివరకు ఆంధ్రలోనే చూశాం. పాలన ఎలా ఉన్నా.. అభివృద్ధి ఎలా ఉన్నా.. కులం ప్రాతిపదికనే ఏపీలో రాజకీయాలు నడుస్తుంటాయి. ఎంతటా అంటే.. ఏకంగా కులం పేరుతో దూషించుకోవడం కూడా చేస్తుంటారు. ఒకరు చౌదరి అంటే.. మరొకరు నాయుడు అంటారు.. ఇంకొకరు రెడ్డి అంటారు. ఇప్పుడు అంతా ఆ కుల రాజకీయం రోడ్డున పడింది. ఇప్పుడు ఆ జాఢ్యం తెలంగాణకు సైతం పాకినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోనూ కుల రాజకీయాలు మొదలయ్యాయి. అయితే.. అది ఇప్పటి వరకూ సామాజిక న్యాయం కోణంలోనే ఉండేవి. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో నేరుగా కులాల గురించి చర్చించుకుంటున్నారు.

Also Read: జగన్ అప్ డేటెడ్ పాలిటిక్స్.. బాబు పార్టీ ఖతమేనా?

హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పీవీ కుమార్తె సురభి వాణీదేవిని రంగంలోకి దింపారు. టీఆర్ఎస్ పోటీ చేయదని చివరి క్షణం వరకూ అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా వాణీదేవిని రంగంలోకి దింపడంతో బీజేపీకి షాక్ తగిలినట్లయింది. టీఆర్ఎస్ కుట్ర పూరితంగా బ్రాహ్మణ్ అభ్యర్థిపై బ్రాహ్మిణ్ అభ్యర్థిని రంగంలోకి దింపి.. ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తోందని బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు టీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు.

అయితే.. ఓ అభ్యర్థిగా ఉండి ఇలా కులాల ప్రకారం మాట్లాడటంతో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఈ చర్చ కుల రాజకీయాలపై వ్యతిరేకతలా కాకుండా ఒకరినొకరు దూషించుకోవడానికన్నట్లుగా మారిపోయింది. మంత్రి కేటీఆర్ కూడా సురభి వాణీదేవికి మద్దతుగా జరిగే సభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా.. తాము బ్రహ్మిణ్ సమాజానికి ఏం చేశామో చెప్పుకొస్తున్నారు. కేసీఆర్‌‌కు గురువులన్నా.. బ్రాహ్మణులన్నా ఎంతో ఇష్టమని చెబుతున్నారు. యాగాలు చేస్తుంటారన్నారు. ఇలా కులాల ప్రకారం విడిపోయి.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయడం తెలంగాణలో ఇదే మొదటి సారి.

Also Read: కాంగ్రెస్ పిచ్చి వ్యూహాలే కొంపముంచుతున్నాయా?

గతంలో కుల సమీకరణాలు.. అంతర్గతంగానే ఉండేవి. కానీ.. ఇప్పుడు ఏపీకి ఏమాత్రం తీసిపోకుండా బహిరంగం అయిపోయింది. అయితే.. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే.. ఇంకా కుల రాజకీయాలు ఆయా సామాజికవర్గాల్ని సంతృప్తి పరిచే దిశగానే ఉన్నాయి. ఒక్క సామాజికవర్గం మీద ఇతరుల్ని రెచ్చగొట్టే రాజకీయాల దాకా ఇంకా వెళ్లలేదు. ఆ అవలక్షణం కూడా చేరితో.. తెలంగాణ రాజకీయాలు కూడా.. ఏపీలాగా కుల రాజకీయాలకు కేరాఫ్‌లా మారిపోవడానికి ఎంతో కాలం పట్టదని చెప్పొచ్చు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper