Homeజాతీయ వార్తలుBengal Elections 2026: రెండున్నర లక్షల మంది సిఆర్పి బలగాలు బెంగాల్ లోనే.. అమిత్ షా...

Bengal Elections 2026: రెండున్నర లక్షల మంది సిఆర్పి బలగాలు బెంగాల్ లోనే.. అమిత్ షా సంచలనం

Bengal Elections 2026: దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బెంగాల్‌లో 142 స్థానాలకు రెండో విడత పోలింగ్‌ ఏప్రిల్‌ 29న జరుగనుంది. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పటిష్టమైన భద్రత నడుమ పోలింగ్‌ జరుగనుంది. మొదటి విడత పోలింగ్‌లో బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు తృణమూల్‌ అంచనా వేస్తోంది. రెండో విడతలో మెజారిటీ సీట్లు గెలవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఇక పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కేంద్ర హోం మంత్రి […]

Bengal Elections 2026: దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బెంగాల్‌లో 142 స్థానాలకు రెండో విడత పోలింగ్‌ ఏప్రిల్‌ 29న జరుగనుంది. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పటిష్టమైన భద్రత నడుమ పోలింగ్‌ జరుగనుంది. మొదటి విడత పోలింగ్‌లో బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు తృణమూల్‌ అంచనా వేస్తోంది. రెండో విడతలో మెజారిటీ సీట్లు గెలవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఇక పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సంచలన ప్రకటన చేశారు. ప్రజలు భయం, జంకు లేకుండా, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పడినా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 2.5 లక్షల మంది సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మరో 60 రోజులు రాష్ట్రంలోనే ఉంటాయని ప్రకటించారు. గత ఎన్నికల్లో కనిపించిన హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి ఇది భరోసా ఇచ్చారు.

రాజకీయ ప్రభావం
ఈ ప్రకటన బెంగాల్‌ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పుతోంది. టీఎంసీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆరోపణలు, ఎన్నికల సమయంలో హింస, బూతులుకు ఇది నేరుగా సమాధానం. బీజేపీకి ఈ అవకాశాన్ని ప్రజల్లో భయాన్ని తొలగించి తమ మద్దతును పెంచుకోవాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో 24 పరగణాలు, కోల్‌కతాలో జరిగిన గొడవలు ఓటర్లను దూరం చేశాయి. ఇప్పుడు సీఆర్పీఎఫ్‌ భద్రత పోలింగ్‌ శాతాన్ని పెంచే అవకాశం ఉంది. ఫలితంగా, బీజేపీ అభ్యర్థులకు ప్రయోజకరంగా మారవచ్చు.

శాంతియుత ఎన్నికలపై ఈసీ దృష్టి
ఎన్నికల కమిషన్‌ కోల్‌కతా, దక్షిణ 24 పరగణాల పోలీసులు, ఎన్నికల యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గొడవలు జరగకుండా చూడాలని తెలిపింది. జరిగితే బాధ్యత అధికారులపైనే పడుతుందని హెచ్చరించింది. ఇది కేంద్ర–రాజ్య పోలీస్‌ సంయోగాన్ని బలోపేతం చేస్తూ, ఎన్నికల పారదర్శకతను నిర్ధారిస్తుంది. మొత్తంగా, ఈ చర్యలు బెంగాల్‌లో శాంతియుత ఎన్నికలకు బలమైన ఆధారం.

అమిత్‌ షా ప్రకటన ఎన్నికల డైనమిక్స్‌ను మార్చే అవకాశం ఉంది. గతంలో ఎన్నికల తర్వాత జరిగిన హింస పోస్ట్‌–పోల్‌ కల్లోలం కారణంగా బీజేపీకిు నష్టం జరిగింది. 60 రోజుల సీఆర్పీఎఫ్‌ డెప్లాయ్‌మెంట్‌ హింసను అరికట్టి, టీఎంసీ బలపడిన ప్రాంతాల్లో కూడా బీజేపీ పెరుగుతాయని తెలుస్తోంది. అయితే, టీఎంసీ దీనిని ’కేంద్ర జోక్యం’గా పేర్కొంది. రెండో విడత ఫలితాలు ఈ వ్యూహాల ప్రభావాన్ని మార్చే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper