spot_img
Homeజాతీయ వార్తలుOdisha Bank Incident: మా అక్క చనిపోయిందన్నాడు..బ్యాంకర్లు నమ్మలేదు.. అస్తిపంజరం తీసుకొచ్చాడు.. గుండెలను మెలిపెట్టే యదార్థం...

Odisha Bank Incident: మా అక్క చనిపోయిందన్నాడు..బ్యాంకర్లు నమ్మలేదు.. అస్తిపంజరం తీసుకొచ్చాడు.. గుండెలను మెలిపెట్టే యదార్థం ఇదీ

Odisha Bank Incident: ఒక మనిషి చావు విషయంలో ఎవరూ అబద్ధం చెప్పరు.. కానీ మనదేశంలో బ్యాంకర్లు మాత్రం చావును కూడా అబద్ధమని అనుకుంటారు. అందుకే ప్రతి దానికి వారు ఆధారం అడుగుతారు. మోసం చేసే వారి విషయంలో ఏమాత్రం అప్రమత్తంగా ఉండని బ్యాంకర్లు.. పేదల విషయంలో మాత్రం అడుగడుగునా నిబంధనలు విధిస్తుంటారు. వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటారు. చివరికి వారి ఖాతాలో డబ్బు తీసుకునే విషయంలో కూడా బ్యాంకర్లు పెట్టే కొర్రీలు సామాన్యులకు నరకం చూపిస్తుంటాయి. అటువంటి నరకమే ఇతడు అనుభవించాడు. చివరికి బ్యాంకర్ల తిక్క కుదిరే విధంగా ప్రవర్తించాడు.

అది ఒడిశా రాష్ట్రం. కియోయొంజర్ జిల్లాలో దియా నాలి అనే గ్రామం ఉంది. ఇక్కడ జీతూ ముండా అనే వ్యక్తి ఉన్నాడు . ఇతడికి కాక్రా అనే చౌదరి ఉంది. ఈమెకు ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. కాక్రా రెండు నెలల క్రితం చనిపోయింది. అంతకుముందే ఆమె భర్త, కుమారుడు కూడా చనిపోయారు. దీంతో కాక్రా కుటుంబ సభ్యుడిగా జీతు మాత్రమే ఉన్నాడు. ఆమె కథలు 19, 300 ఉన్నాయి. వాటిని విత్ డ్రా చేసుకోవడానికి జీతూ బ్యాంకు అధికారులను సంప్రదించాడు. డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే ఖాతా కలిగిన వ్యక్తి కచ్చితంగా ఉండాలని.. అతడు తప్పనిసరిగా హాజరుకావాలని.. ఒకవేళ జీవించలేని పక్షంలో మరణ ధ్రువీకరణ పత్రం.. ఇతర వారసత్వ పత్రాలు సమర్పించాలని బ్యాంకు అధికారులు సూచించారు. డబ్బు ఇవ్వడానికి బ్యాంక్ అధికారులు ఒప్పుకోలేదు.

బ్యాంకు అధికారులు సూచించిన పత్రాలు జీతూ వద్ద లేవు. జీతూ అనేక సందర్భాల్లో బ్యాంకు అధికారులను సంప్రదించాడు. అతడు వెళ్లిన ప్రతి సందర్భంలోనూ బ్యాంకు అధికారులు ఇలానే మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో అతనిలో సహనం నశించిపోయింది. వెంటనే స్మశాన వాటికకు వెళ్లి.. తన సోదరి అవశేషాలను తవ్వి తీశాడు. ఆమె ఆస్తిపంజరాన్ని ఒక వస్త్రంలో చుట్టి బ్యాంకు వద్దకు తీసుకెళ్లాడు. ఆ ఆస్తిపంజరం చూసిన బ్యాంకు అధికారులు భయపడ్డారు. వెంటనే పోలీసులకు విషయాన్ని చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకొని.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. డబ్బు జీతూ అందించే విధంగా బ్యాంకు అధికారులతో చర్చలు జరిపారు.

ఒక మనిషి చనిపోయిన విషయంలో ఎవరు కూడా అబద్ధం చెప్పరు. కానీ బ్యాంకు అధికారులకు ఆధారాలు మాత్రమే కావాలి. మనిషి చనిపోయాడని చెబుతున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించకుండా బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అసలే అతడు నిరక్షరాస్యుడు.. పైగా ఆదివాసి.. ఇటువంటి సమయంలో అతడు ఆధారాలు ఎక్కడ నుంచి తీసుకొస్తాడు.. అతడు తన సోదరి చనిపోయిందని చెప్పినప్పుడు బ్యాంకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి కదా.. అలా చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం చివరికి పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper