దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటివరకూ మమతా బెనర్జీ లాంటి ముఖ్యమంత్రిని ఎవరూ చూసి ఉండరు. ముఖ్యమంత్రినే చట్టాలు ఉల్లంఘిస్తోంది. స్వయంగా తనే ‘ఐ ప్యాక్’ డైరెక్టర్ ఇంటికి వెళ్లి ఈడీ అధికారులను బెదిరించి ఫైళ్లు, ల్యాప్ టాప్ లు, మొబైల్ లను తెచ్చుకుంటోంది. దానిమీద కోర్టుకెక్కిన వారి మీదకు టీఎంసీ కార్యకర్తలను పంపిస్తోంది. అసలు ఒకటి కాదు.. ఎన్ఫోర్స్ మెంట్ , సీబీఐ ల మీద కేసులు పెడుతోంది. ఇటువంటి ముఖ్యమంత్రులు ఉంటారా? అన్నది దేశం ఆశ్చర్యపోతోంది.
ఇప్పుడు మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ లో కోటి నుంచి కోటిన్నర మంది అక్రమ వలసవాదులు ఉంటారని ఒక అంచనా.. వీళ్లంతా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చినవారే.. వీరు రావడానికి బీఎస్ఎఫ్ వైఫల్యం అంటూ మమత సైన్యంపై తోసేస్తుంది. ఇక తమకు ఫెన్సింగ్ వేయడానికి భూమి ఇవ్వడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు.
బంగ్లాదేశ్ సరిహద్దుకి కంచె వేయకపోవటానికి ప్రధాన అడ్డంకి మమతా బెనర్జీ .. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.