Homeఅంతర్జాతీయంAfghanistan: అఫ్గన్ లో మహిళల పరిస్థితి కడు దయనీయం

Afghanistan: అఫ్గన్ లో మహిళల పరిస్థితి కడు దయనీయం

Afghan womenAfghanistan: అఫ్గనిస్తాన్ లో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోతోంది. దేశం విడిచి వెళ్లాలనుకున్నా కుదరడం లేదు. తాలిబన్ల (Taliban) చెరలో ఉన్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. వారి నియంతృత్వ పాలనలో మహిళలైతే (Women) చాలా తిప్పలు పడుతున్నారు. దేశం విడిచి వెళ్లాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వేలాది మంది కాబుల్ విమానాశ్రయం వద్ద పడిగాపులు కాస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గానీయులంతా దేశం వదిలేందుకే మొగ్గు చూపుతున్నా వీలు కావడం లేదు. చివరి వరకు ప్రయత్నించి ఇక ఏదైనా జరగనీ తమకు ప్రాణాలు ఉంటే ఉంటాయి లేకపోతే లేదు అని నిర్ణయించుకుని సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ఎయిర్ పోర్టులో ఎదురు చూసి భరించలేక తమ ఊళ్లకు వెళుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు రోడ్లపై పడే తిప్పలు చూస్తుంటే ఎవరికైనా జాలి కలుగుతుంది. కానీ తాలిబన్లకు మాత్రం అది లేదని తెలుస్తోంది. చావైనా రేవైనా తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నారు.

అఫ్గనిస్తాన్ కు చెందిన మహిళా ఉపాధ్యాయురాలు షరిన్ తబ్రిక్ (43) దేశం విడిచి వెళ్లేందుకు ఐదు రోజుల క్రితం కాబుల్ హమీద్ కర్జాయ్ విమనాశ్రయానికి చేరుకుంది. ఐదు రోజులు అక్కడే బస చేసింది. కానీ ఆమెకు దేశం విడిచి వెళ్లేందుకు సాధ్యం కాదని తెలుసుకుని తిరిగి సొంత ఊరికి వెళ్లిపోయింది. దేశంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. దేశం విడిచి వెళ్లాలని భావించినా అది కుదరదని తెలిసిపోయిందని వాపోయింది.

తాలిబన్లు మహిళలపై జరుపుతున్న దాడులపై అందరిలో భయం పట్టుకుంది. అందుకే దేశం విడిచి వెళ్లేందుకు తాపత్రయపడుతున్నారు. అమెరికన్లు కూడా అఫ్గనీయులను అవమానిస్తున్నారు. అన్ని పత్రాలున్నా దేశం విడిచి వెళ్లడానికి అనుమతులు రావడం లేదు. దీంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సొంత దేశంలో కూడా పరాయి వారిలో బతకాల్సి వస్తోందని వాపోతున్నారు.

కాబుల్ విమానాశ్రయంలో పరిస్థితి ఇలా ఉంటే ఇక విదేశీయులెవరిని మాత్రం అడ్డుకోకుండా పంపిస్తున్నారు. అన్ని పత్రాలు ఉన్న తమను ఎందుకు వెళ్లనివ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాలిబన్లు అడుగడుగునా ఆపుతూ వేధింపులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఓ వైపు ఉగ్రదాడులు, తాలిబన్ల ఆగడాలతో జనానికి నిద్ర కరువవుతోంది. అయినా తప్పని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోవాల్సి వస్తోందని చెబుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper