Indian Tourist Taliban: ఆఫ్ఘనిస్తాన్ అంటేనే అరాచక దేశం అనే ఒక ముద్ర ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అక్కడి తాలిబాన్లు అచారక పాలన సాగిస్తున్నారన వార్తలు తరచూ వార్తల్లో వస్తుంటాయి. మిలిటెంట్ పాలనను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆ దేశానికి వెళ్లేవారు తగ్గిపోయారు. అయితే ఇటీవల మోదీ చేపట్టిన దౌత్యపరమైన చర్యలతో భారత్–ఆఫ్గాన్ మధ్య స్నేహభావం నెలకొంది. రెండు మిత్ర దేశాలుగా మారాయి. ఆపద కాలంలో సాయం అందించడంలో భారత ప్రభుత్వం ముందు ఉంటుంది. ముస్లిం దేశమే అయినా మానవతా సాయంలో మోదీ ముస్లిం దేశాలకన్నా ముందే స్పందిస్తున్నారు. దాని ఫలితం కూడా కనిపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడనికి ఆఫ్ఘన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత్‌కు అండగా నిలిచింది. తాజాగా అఫ్గానిస్తాన్‌లో ప్రయాణిస్తున్న భారతీయ మోటో వ్లాగర్‌కి చెక్‌పోస్ట్ వద్ద అసాధారణ స్వాగతం లభించింది. సాధారణంగా తాలిబన్ నియంత్రణ ప్రాంతాల్లో కఠినంగా జరిగే తనిఖీలు ఇక్కడ మాత్రం విరుద్ధంగా మారాయి. అతను భారతీయుడని చెప్పగానే అక్కడి సైనికులు సంతోషంగా స్వాగతిస్తూ, వేడివేడి చాయ్ అందించారు. వెల్‌కం టూ ఆఫ్ఘనిస్తాన్.. వెల్‌కంటూ కాబూల్ అని షేక్‌హ్యాండ్ ఇచ్చాడు.
పాస్‌పోర్టు కూడా చూడకుండా..
ఆసక్తికరంగా, అతని పాస్‌పోర్టును తిరుగుతూ చూడకుండా, కేవలం వ్యక్తిత్వంపై నమ్మకం ఉంచి ముందుకు పంపించారు. ఇటువంటి చర్య, తాలిబన్ కఠిన నియమావళి మధ్య అరుదైన ఉదాహరణగా నిలిచింది. ఈ సంఘటన, భారత్–అఫ్గానిస్తాన్ మధ్య కొనసాగుతున్న సత్సంబంధాలను ప్రతిబింబించింది. మోదీ నాయకత్వంలో, ఇరు దేశాల సంబంధాలు కొంతమేరుగా స్థిరతను పొందాయని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్థిక, మానవతా సహాయం, పునర్నిర్మాణ ప్రాజెక్టుల ద్వారా భారతదేశం అక్కడి ప్రజలకు పాజిటివ్ ఇమేజ్ సాధించింది.
భవిష్యత్ ప్రాధాన్యం
ఇలాంటి వ్యక్తిగత అనుభవాలు, ప్రజల స్థాయిలో పెరుగుతున్న నమ్మకం, స్నేహభావానికి సూచనలు. పాలనా స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, పౌర–పౌర సంబంధాలు ద్వైపాక్షిక సహకారాన్ని బలపడించే అవకాశముంది. మన చుట్టూ శత్రు దేశాలు ఉన్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ మనకు కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలోనే మోదీ వ్యూహాత్మకంగా ఆఫ్ఘనిస్తాన్‌తో స్నేహం చేస్తున్నారు.
తాలిబన్ చెక్‌పోస్ట్‌లో ఒక భారతీయుడికి ఇచ్చిన ఆతిథ్యం, కేవలం ఓ క్షణిక సంఘటన కాకుండా, ఇరు దేశాల సంబంధాలలో మెరుగుదలను చూపించింది. ఈ అనుభవం, భవిష్యత్ భారత–అఫ్గాన్ పరస్పర మైత్రి చరిత్రలో చిన్న కానీ ముఖ్యమైన ఘట్టంగా నిలవవచ్చు.
An Indian tourist in Afghanistan was stopped by the Taliban at a checkpoint for a routine passport check. But the moment he said he was from India, they smiled, welcomed him, & let him go without even checking his documents. This is how Afghanistan treats its true friends. ❤️ pic.twitter.com/YsKFVVEVP5
— Fazal Afghan (@fhzadran) October 7, 2025