spot_img
Homeలైఫ్ స్టైల్Worlds best Diet: ప్రపంచంలోని బెస్ట్ డైట్ ఏంటో మీకు తెలుసా?

Worlds best Diet: ప్రపంచంలోని బెస్ట్ డైట్ ఏంటో మీకు తెలుసా?

Worlds best Diet: ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఆరోగ్యమైన ఆహారం (Healthy Food) తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొందరు అన్నింటికంటే బెస్ట్ డైట్‌ను (Best Diet) కూడా పాటిస్తుంటారు. పోషకాలు ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు (Health Issues) లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. గత జనరేషన్‌తో పోలిస్తే ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో ఏదో ఒక సమస్యతో (Health Issues) ఇబ్బంది పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం పోషకాలు ఉండే ఆహారాన్ని తినకపోవడమే అని కొందరు నిపుణులు చెబుతున్నారు. పూర్వం రాగి జావ వంటివి తీసుకునే వారు. కానీ ప్రస్తుతం పిస్తా, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి తీసుకుంటున్నారు. వీటిలో పోషకాలు ఉండవు. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచకుండా అనారోగ్యం పాలయ్యేలా చేస్తా్యి. అయితే ఈ ప్రపంచంలో పోషకాలు ఉండే ఎన్నో పదార్థాలు ఉన్నాయి. మరి ఈ ప్రపంచంలో ఉండే బెస్ట్ డైట్ ఏం ఈ రోజు ఆర్టికల్‌లో చూద్దాం.

ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆహారం మధ్యధరా అని తాజాగా ఓ రిపోర్ట్ తెలిపింది. ఇందులోని ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆహారంలో నాణ్యత కూడా ఉందని తేలింది. ఈ ఆహారాన్ని తినడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. అయితే చాలా మందికి మధ్యధరా ఆహారం అంటే ఏంటో సరిగ్గా తెలియదు. మధ్యధరా సముద్రం చుట్టూ దొరికే ఆహారాన్ని మధ్యధరా ఆహారం అంటారు. అంటే ఇది మొక్కల ఆధారిత ఆహారం. ఈ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు, గింజలు, మూలికలు, మసాలాలు, ఆలివ్ నూనె వంటివి అన్ని ఉంటాయి. వీటిలో జంతు ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. వీటివల్ల శరీరానికి ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. నష్టాలు కంటే లాభాలు మాత్రమే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీని తర్వాత డాష్ అనే ఆహారం కూడా బెస్ట్ డైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి శరీరానికి మేలు మాత్రమే చేస్తాయి.

ఈ మధ్యధరా ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ ఆహారంలో ఉండే పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. వీటిలో ప్రధానంగా తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు ఉంటాయి. ఇవి గుండె పోటు వంటివి రాకుండా చేస్తాయి. గుండె కండరాలలో మంటను కూడా తగ్గిస్తాయి. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చాలా మంది ఇలాంటి ఆహారాన్ని తినకుండా పోషకాలు లేనివి తింటారు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి బెస్ట్ డైట్‌ను తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper