Homeహెల్త్‌world best whiskey : ప్రపంచంలో బెస్ట్‌ విస్కీ అదే.. మన దేశంలోనే తయారీ.. ధర...

world best whiskey : ప్రపంచంలో బెస్ట్‌ విస్కీ అదే.. మన దేశంలోనే తయారీ.. ధర ఎంతో తెలుసా?

world best whiskey :  మద్యపానం… ఇప్పుడు సర్వ సాధారణమైంది. పెళ్లిళ్లు.. పుట్టిన రోజులు.. జాతరలు.. శుభ వార్తల సమయంలోనే కాదు.. చావు సమయంలోనూ మద్యం తాగడం కామన్‌ అయింది. మందు తాగడానికి ఓ కారణం దొరికితే చాలు అన్న పరిస్థితి. అందుకే మద్యం అమ్మకాల్లో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మద్యం తాగడానికి కారణాలు వెతుక్కున్నట్లుగానే.. ఏ మందు తాగడానికి కూడా మందుబాబులు కారణాలు వెతుక్కుంటారు. వారి ఆర్థిక వెసులుబాటు, స్టేటస్, ఒంటరిగా మందు తాగడం, బంధు మిత్రులతో కలిసి తాగడం వంటి అంశాల ఆధారంగా మద్యం బ్రాండ్‌ను ఎంపిక చేసుకుంటారు. కూలినాటి చేసి జీవనం సాగించేవారు కష్టం మర్చిపోవడానికి ఎక్కువ కిక్కు ఇచ్చే మద్యం సేవిస్తారు. మధ్య తరగతి జీవులు తమ ఆర్థిక వెసులుబాటును బట్టి మద్యం బ్రాండ్‌ ఎంపిక చేసుకుంటారు. ఇక సంపన్నులు కాస్ట్‌లీ మద్యానికే ప్రాధాన్యం ఇస్తారు. మరి మద్యం అంతా ఒక్కటే కదా.. ఏది తాగినా అనారోగ్యమే కదా అంటే.. అది వాస్తవమే. కానీ, అది ఇచ్చే కిక్కు, రుచి, వాసన ఆధారంగా మద్యం తయారీ కంపెనీలు ధరలు నిర్ణయించి విక్రయిస్తున్నాయి. ప్రపంచంలో నంబర్‌ వన్‌ మద్యం కూడా మన దేశంలోనే తయారవుతుంది. అదేంటి.. దాని ధర ఎంత అనే వివరాలు తెలుసుకుందాం.

ఇండియాలోనే బెస్ట్‌ విస్కీ..
భారత్‌ కు చెందిన ఓ వైన్‌ ప్రపంచంలోని అన్ని విస్కీలను అధిగమించి నంబర్‌ వన్‌ విస్కీగా నిలిచింది. ఇంద్రీ దీపావళి కలెక్టర్‌ ఎడిషన్‌ 2023 మేడ్‌ ఇన్‌ ఇండియా ప్రపంచంలోనే ఉత్తమ విస్కీ అవార్డును గెలుచుకుంది. అమెరికన్‌ సింగిల్‌ మాల్ట్, స్కాచ్‌ విస్కీ, బోర్బన్, కెనడియన్‌ విస్కీ, ఆస్ట్రేలియన్‌ సింగిల్‌ మాల్ట్, బ్రిటీష్‌ సింగిల్‌ మాల్ట్‌ తో సహా 100 వేర్వేరు విస్కీలను రుచి చూసిన తరువాత ఇండీ ఉత్తమమైనదిగా గుర్తించబడింది.

ఉత్తరప్రదేశ్‌లో తయారీ…
ఈ ఇంద్రి దీపావళి కలెక్టర్‌ విస్కీని ఉత్తరప్రదేశ్‌ లిక్కర్‌ కంపెనీ తయారు చేస్తుంది. ఆ రాష్ట్రంలో ఇంద్రీ సింగిల్‌ మాల్ట్‌ ఇండియన్‌ విస్కీ రూ.3,100కే లభిస్తుంది. మహారాష్ట్రలో కొంటే దాదాపు రూ.5100 వస్తుంది. ప్రస్తుతం భారతదేశంలోని 19 రాష్ట్రాలు, ప్రపంచంలోని 17 దేశాల్లో ఈ మద్యం అందుబాటులో ఉంటుంది.

ప్రత్యేకత ఇదీ..
ఈ విస్కీ ప్రత్యేకత ఏంటంటే ఈ కంపెనీ ప్రారంభించి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అయ్యింది.. కానీ ఇప్పటికే 14కు పైగా అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. పికాడిల్లీ డిస్టిలరీస్‌ దీనిని మొదట 2021 లో హర్యానాలో ప్రారంభించారు. ఆ తరువాత ఇది చాలా ఫేమస్‌ అయ్యింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular